విన్నపములు భవానీశంకర విన్నపములు  

భవానీశంకర విన్నపములు
01

శ్రీకంఠా! నీవు సమస్తలోకోపకారార్థంబుగ సంపాదించిన సాధనంబులు నాకు దొరకుటం జేసి నిర్భయస్వాంతుఁడనైతిని. ఎట్లంటివేని బ్రహ్మహత్య, సురాపాన, గురుతల్పగమన, సువర్ణస్తేయ, తత్సంగతు లను మహాపాతకంబు లైదింటినిం గెలువ నైదక్షరంబుల మంత్రం బొకటి నానాలుకం గీలుకొనియె. పరేతరాట్కింకరపిశాచంబులు నన్నుఁ జేరకుండ ఫాలాగ్రంబున భసితత్రిపుండ్రాంకంబు వహించితి; అనేక క్షుద్రపాపంబులఁ దరిమి సర్వోపద్రవశాంతి యొనర్చు రుద్రాక్ష నామేనం బూనితి; శాశ్వతానందంబై, యఖిలభద్రగుణగణాలంకారంబై యొప్పు నమ్మహాకారకంబైన ఓంకారంబు నాహృదయంబునఁ గుదురయ్యె. ఇంక నిత్యంబును “శివాయ, శంకరాయ, శర్వాయ, రుద్రాయ, మహాదేవాయ” యనుచు, నాఁ జేయు నమస్కృతులు మీమీఁద నప్పై యుండకుండ నన్ను గటాక్షించి సుగతి యొసంగి రక్షింపవే! భవానీమనోహరా!

భవానీశంకర విన్నపములు
02

AndhraBharati AMdhra bhArati - bhavanISaMkara vinnapamulu - bhavAnImanOhara vinnapamulu - bhavAnimanOhara vachanamulu - telugu andhra tenugu ( telugu andhra )