భాష | నిఘంటువులు | ఆంధ్రనామసంగ్రహము |
దేవవర్గు | ||
సీ. |
ముక్కంటి యరపది - మోముల వేలుపు మినుసిగ దయ్యంబు - మిత్తి గొంగ గట్టువిల్తుఁడు గఱ - కంఠుడు మిక్కిలి కంటిదేవర బేసి - కంటివేల్పు వలిమలల్లుడు మిన్ను - వాఁకతాలుపు కొండ వీటిజంగము గుజ్జు - వేల్పుతండ్రి వలరాజుసూడు జ - క్కులఱేని చెలికాడు బూచుల యెకిమీఁడు - పునుకతాల్పు |
|
తే. |
విసపుఁమేతరి జన్నంపు - వేఁటకాఁడు బుడుత నెలతాల్పు వెలియాల - పోతు రౌతు తోలుతాలుపు ముమ్మొన - వాలు దాల్పు నాఁగ భవదాఖ్య లొప్పు నం - ధక విపక్ష! |
6 |
సీ. |
సోఁకుమూఁకలగొంగ - చుట్టుఁ గైదువుజోదు పచ్చవిల్తునితండ్రి - లచ్చి మగఁడు పులుఁగుతత్తడిరౌతు - వలమురితాలువు వెన్నుఁడు కఱివేల్పు - వెన్నదొంగ నునుగాడ్పుదిండిపా - నుపునఁ బండెడుమేటి బమ్మదేవరతండ్రి - తమ్మికంటి పదివేసములసామి - పసిఁడిపుట్టముదాల్పు కఱ్ఱినెచ్చెలి తరి - గట్టుదారి |
|
తే. |
యాలకాపరి వ్రేఁతల - మేలువాఁడు పాలకడలల్లుఁడును బక్కి - డాలుఱేఁడు ఱేయుఁబవలును జేయుక - న్దోయివాఁడు మామమామన హరి యొప్పు - శ్రీమహేశ! |
7 |
సీ. |
పక్కిడాల్వేలుపు - పొక్కిలిపసిబిడ్డఁ డంచతేజీనెక్కి - యాడురౌతు మనెడిప్రొద్దులనొస - ళ్లను వ్రాయుదేవర చదువులవేలుపు - జన్నిగట్టు తెలిదమ్మిగద్దియఁ - గొలువుండురాయఁడు నిక్కపుజగమేలు - నేర్పుకాఁడు కడుపుబంగారుబొ - క్కసముఁజేసినమేటి పోరోగిరముతిండి - పోతుతండ్రి |
|
ఆ. |
నలువ తమ్మిచూలి - నలుమొగంబులవేల్పు వేల్పుపెద్ద పలుకు - వెలఁదిమగడు తాత బమ్మ యన వి - ధాతనామములొప్పు నఘవినాశ! యీశ! - యభ్రకేశ! |
8 |
తే. |
గట్లరాయనిపట్టి ము - క్కంటివెలఁది యేనుఁగులగొంగతత్తడి - నెక్కుదంట సామిసామేనిఁ జేకొన్న - చాన జగము తల్లి యన గౌరిపేళ్లొప్పు - ధర నుమేశ! |
9 |
తే. |
లచ్చి కలుములజవరాలు - పచ్చవిల్తు తల్లి కఱివేల్పునిల్లాలు - తల్లితల్లి కడలికూఁతురు సిరి లిబ్బి - పదఁతి తమ్మి యింటిగరి తన శ్రీయొప్పు - మృగధరాంక! |
10 |
క. |
తలవాఁకిటను మెలంగెడు పొలఁతుక పలుకులవెలంది - పొత్తముముత్తో నలువపడఁతి కలుములపై దలికోడ లనంగఁ బరఁగు - ధర వాణి శివా! |
11 |
సీ. |
ఇద్దరుతల్లుల - ముద్దుబిడ్డఁడు పని చెఱుపులదొర చేట - చెవులవేల్పు వంకరతొండంబు - వాఁ డేనుఁగు మొగంబు దేవర పాఁపజం - దెములమేటి మ్రొక్కువారలపనుల్ - చక్కఁజేసెడుసామి గఱికపూజల మెచ్చు - గబ్బివేల్పు ముక్కంటిపండుల - మెక్కెడితిండీఁడు ముక్కంటిగారాబు - ముద్దుపట్టి |
|
ఆ. |
పెద్దకడుపువేల్పు - పిళ్లారి కుడుముల తిండికాఁడు కొక్కు - తేజిరౌతు గుజ్జువేలు పొంటి - కొమ్ముదేవర వెన కయ్య యన వినాయ - కాఖ్య లీశ! |
12 |
సీ. |
పెనుఁబాఁపకవణంబుఁ - దినువారువమురౌతు గట్టులయెకిమీని - పట్టిపట్టి ఱెల్లు చూ లార్గురు - తల్లులకొమరుండు గాడుపుసంగడి - కానికొడుకు పుంజుదాలుపు వేలు - పులఱేనిదళవాయి జంటముమ్మోముల - దంటవేల్పు కొంచగుబ్బలివ్రక్క - లించినబలుదిట్ట రెండాఱుచేతుల - దండిమగఁడు |
|
తే. |
వేలుపులమూఁక పేరిటి - వెలఁదిమగఁడు వేల్పుగమికాఁడు వెనకయ్య - వెనుకవాఁడు కొమరుసామన సేనాని - కొమరుమిగులు విగతభవపాశ! కాశీని - వేశ! యీశ! |
13 |
సీ. |
అలరువిల్తుండు క - న్నులవిల్తుఁడును గమ్మ విలుకాఁడు చక్కెర - వింటివాఁడు చెఱకువిల్కాఁడు కెం - జిగురులవిల్తుఁడు వెడవిల్తుఁడును బచ్చ - విల్తుఁ డించు విల్లుదాలుపు తుంట - విలుకాఁడు తియ్యవి ల్కాఁడును జమిలిము - క్కాలినారి విలుకాఁడు చౌవంచ - ములుకులుగలదంట రాచిల్కనెక్కెడు - రాయరౌతు |
|
తే. |
మీనుమొసలిసిడంబుల - మేటి చంద మామయల్లుఁడు వలరాజు - మరుఁడు లచ్చి కొమరుఁడను పేళ్ల నొప్పును - గుసుమధన్వి విగతభవపాశ! కాశిని - వేశ! యీశ! |
14 |
సీ. |
చలువలఱేఁడు వె - న్నెలఱేఁడు రేఱేఁడు జాబిల్లి రేవెల్గు - చందమామ తమ్ములపగవాఁడు - కమ్మవిల్తునిమామ కలువలఱేఁడు పా - ల్కడలిపట్టి జక్కవకవవిప్పు - ముక్కంటితలపువ్వు చుక్కలదొర ప్రొద్దు - జోడుకోడె తపసికన్పాప బి - త్తరిజింకతాలుపు కఱివేల్పుడాకన్ను - కడలివెన్న |
|
తే. |
పంటపైరులయెకిమీఁడు - జంటదంట చౌకములపాళ్ల తెలిముద్ద - చలివెలుంగు వేలుపులబువ్వ చీఁకటి - వేరువిత్తు నెల యనఁగ జంద్రుపే - ళ్లొప్పు నీలకంఠ! |
15 |
సీ. |
వెన్నునివలకన్ను - వేఁడివేలుపు ప్రొద్దు తొవలరాయిడికాఁడు - పవలుసేయు వేలుపు పచ్చగు - ఱ్ఱాలవజీఱుండు వేఁడివెలుంగు రే - వెల్గుజోడు జంటాఱుమేనుల - సామి చీఁకటిగొంగ యెఱ్ఱనివేలుపు - నివముసూడు చదలుమానికము ప్రాఁ - జదువుల పెట్టియ యేడుగుఱ్ఱముల తే - రెక్కుజోదు మువ్వేలుపులయిక్క - మ్రొక్కులదేవర గాములఱేఁడు జ - క్కవలఱేఁడు వేయి చేతులఱేఁడు - వెలుఁగులయెకిమీఁడు చయువులసాకిరి - చాయమగఁడు |
|
తే. |
మింటి తెరువరి తమ్మివా - ల్గంటి మగఁడు పోరనీల్గెడుమొనగాండ్రు - పోవుదారి జగముచుట్టంబు జమునయ్య - జగముకన్ను నాఁగ సూర్యునిపే ళ్లొప్పు - నాగభూష! |
16 |
సీ. |
చట్టుపల్‌దెగగట్లఁ - గొట్టెడుజెట్టి నూ ఱంచులవాలు చే - మించుజోదు దుగబొట్లపిఱిఁది యై - దుకనుంగవలవేల్పు పాఱుతపసియింటి - పంచకోడి యొడలిచూపొడయఁ డె - క్కుడుమొగుల్‌గలప్రోడ నిక్కువీనులజక్కి - నెక్కురౌతు తెల్లయేనుఁగు నెక్కి - తిరిగెడుదొర తూర్పు మాగానియేలెడు - మణియకాఁడు |
|
తే. |
జమిలిచౌవంచపదులు జ - న్నములు సేసి నట్టివేలుపు సోమాసి - పెట్టుఁజెట్టు పొట్టితమ్ముఁడు గల్గిన - యట్టివేల్పు నాఁగ నింద్రుని పేళ్లొప్పు - నాగభూష! |
17 |
ఆ. |
నీరుపాప గాలి - నెచ్చెలి యన్నింటి తిండికాఁడు కప్పుఁ - దెరువుజాడ యంటరానివేల్పు - జంటమోములసామి యగ్గి యనఁగ నొప్పు - ననలుఁ డీశ! |
18 |
తే. |
జమునసైదోడు పెతరుల - సామి జముఁడు ప్రొద్దుకొమరుఁడు గుదెతాల్పు - పోతుజక్కి నెక్కియాడెడుబలురౌతు - దక్కిణంపు సామి యన నంతకుం డొప్పు - శ్రీమహేశ! |
19 |
ఆ. |
మూలరేఁడు సోఁకు - మూఁకలఱేఁడు రే ద్రిమ్మరీఁడు పొలసు - దిండిపోతు రక్కసుండు నల్ల - ద్రావువాఁ డనఁగను నిరృతిపేళ్లు సెల్లు - నీలకంఠ! |
20 |
ఆ. |
మేటినీరుచూలి - మెయితాలుపులసామి వల్లెత్రాడుదాల్పు - నీళ్ల రాయఁ డేటిబోఁటిమగల - యెకిమీఁడు పడమటి దొర యనంగ నొప్పు - వరుణుఁ డీశ! |
21 |
సీ. |
వడిగలజింకత - త్తడి నెక్కునెఱరౌతు మేటిపాములమేఁత - నీటితాత యొడలితాల్పులపిండు - కుసు రగుబలియుండు సోఁకుదయ్యము మింటి - చూలి గాలి కరువలి తెమ్మెర - గాడ్పు పయ్యర యొంటి మ్రాకుల పెనుముప్పు - మబ్బువిప్పు సురటివీపులఁ బుట్టు - సుడిగొట్టు చలినట్లు బక్కవారలపెను - బాద యీఁద |
|
తే. |
అబ్బురపుఁదియ్యవిలుకాని నిబ్బరంపు దెబ్బపోరుల నలయిక - ప్రబ్బుబోంట్ల గబ్బిగుబ్బల చెమటల - యుబ్బడంచు గబ్బినాఁ జను మారుతా - ఖ్యలు మహేశ! |
22 |
క. |
మరుదాఖ్య లొప్పుచుండును ధర వినుచూలి యన సోఁకు - దయ్య మనం బ య్యెర యన గొ ట్టన నీఁ దనఁ గరువలి యనఁ దెమ్మె రనఁగ - గాలి యనంగన్. |
23 |
క. |
ముక్కంటియనుఁగుజెలి వడ చక్కేలిక చాగకాఁడు - జక్కులదొర బల్ రొక్కమెకిమీఁడు మానిసి నెక్కెడువాఁడనఁగ జను ధ - నేశుం డభవా! |
24 |
క. |
విడిముడి గలవేలుపుచెలి జడముడిజంగంబు గడదె - సం గాపరియౌ యొడయండు పాఁపతొడవుల నిడియెడివే ల్పనఁగ నొప్పు - నీశానుఁ డిలన్. |
25 |
క. |
దేవాలయాహ్వయంబులు కోవెల యన దేవళంబు - గుడి నా వెలయు\న్ దేవళ్లన జేజేలనఁ గా వేలుపు లనఁగ వెలయుఁ - గ్రతుభుగభిఖ్యల్. |
26 |
ఆ. |
క్షితినిఁబేళ్లు దనరు - సీద్రంపుఁ బెద్ద బల్ పాఁపఱేఁడు వెన్ను - పానుపనఁగఁ బుడమితాలు పనఁగఁ - దడవులనిడుపఁడు చిలువఱేఁ డనంగ - శేషునకును. |
27 |
క. |
మరునయ్యతేజి పులుఁగుల దొర పాములవేఁటకాఁడు - తూరుపునా డేల్ దొరబువ్వఁ గొన్నలావరి గరుటామంతుఁ డన నొప్పు - గరుడుం డభవా! |
28 |
ఆ. |
నల్లవలువతాల్పు - తెల్లనిమైదంట వెన్నదొంగయన్న - వెఱ్ఱినీళ్ల మేలువాఁడు దుక్కి - వాలుదాలుపు తాటి పడగవాఁ డనంగ - బలుఁడు రుద్ర! |
29 |
క. |
వడముడి యనఁగా గాడుపు కొడు కన నివి రెండుబేళ్ల - గున్ భీమునకుం బుడమిం గఱ్ఱి యనం గ వ్వడి యన వివ్వచ్చుఁ డనఁగ - వాసవి యీశా! |
30 |
తే. |
వేలుపులత్రోవ యుప్పర - వీది యాక సంబు విను విన్ను మిను మిన్ను - చదలు నింగి దివి మొయిలుదారి చుక్కల - తెరువు బయలు గాడ్పుతం డ్రన నభమొప్పు - గరళకంఠ! |
31 |
తే. |
వెలయు ధరణిఁ జతుర్దిశల్ - నలుఁగడ లన నలరు దచ్చికడ లన ది - శాష్టకంబు దనరు నీరైదుకడలు నా - దశదిశలును మౌళిధృతగంగ! యంగజ - మదవిభంగ! |
32 |
ఆ. |
తాటిసిడమువాని - తల్లి కూఁతురిబిడ్డ వెన్నునడుగుపాప - మిన్నువాఁక వేల్పుటేఱు గడలి - వెలఁదుక ముత్త్రోవ ద్రిమ్మ రనఁగ నొప్పు - దివిజగంగ! |
33 |
తే. |
వేలుపులగౌరు చౌదంతి - వెల్లయేనుఁ గనఁగ నైరావతంబున - కాఖ్య లమరు వేల్పుదొరతేజి యనఁగను - వెల్లగుఱ్ఱ మనఁగ నుచ్చైశ్శ్రవం బొప్పు - నంబుకేశ! |
34 |
ఆ. |
పుడుకుఁదొడుకు వేలు - పులగిడ్డి వెలిమొద వనఁగఁ గామధేను - వలరుచుండుఁ గల్పకంబు దనరు - వేల్పుఁ జెట్టీవుల మ్రాను వెల్లమ్రాను - నా నుమేశ! |
35 |
ఆ. |
అవని గడుసుకైదు - వనఁగ వేయంచుల కైదు వనఁగఁ జుట్టు - గైదు వనఁగ బటువుఁగైదు వనఁగఁ - బరఁగు సుదర్శన చక్రమునకుఁ బేళ్లు - చంద్రమౌళి! |
36 |
ఆ. |
వలమురి యనఁ జుట్టు - వాలుజో డనఁ గల్మి కొమ్మమగనిబూర - గొ మ్మనంగఁ దనరుఁ బాంచజన్య - మునకు నభిఖ్యలు ధృతకురంగ! ధవళ - వృషతురంగ! |
37 |
తే. |
రిక్క లనఁ జుక్క లనఁగను - ఋక్షములకు నాఖ్యలై యొప్పుఁ దెఱఁగంటి - యన్ను లనఁగ నచ్చర లనంగ వేలుపు - మచ్చకంటు లనఁగ సురకాంతలకు నాఖ్య - లగు గిరీశ! |
38 |
తే. |
పవలు పగ లనఁ బే ళ్లొప్పు - దివమునకును రాత్రిపేళ్లొప్పు రే రేయి - రాతి రనఁగ వెలయుచుండును రేయెండ - వెన్నెలనఁగఁ జంద్రికకను సమాఖ్యలు - చంద్రమౌళి! |
39 |
క. |
మించు లన మెఱుపు లనఁగను జంచలలకుఁ పేళ్లు దనరు - జలధరములు రా ణించుం బలుకంగ మొయి ళ్లంచు మొగుళ్ళంచు మబ్బు - లంచున్ భర్గా! |
40 |
క. |
తొలుచదువులు ప్రాఁజదువులు దొలుమినుకులు ప్రామినుకులు - దొలుపలుకులు ప్రాఁ బలుకులు పెనుమినుకులు నా వెలయున్ శ్రుతులకును బేళ్లు - విశ్వాధిపతీ! |
41 |
క. |
ఇది దేవవర్గు దీనిం జదివిన వ్రాసినను వినిన - జనులకు నిత్యా భ్యుదయంబు లొసఁగుచుండును వదలక కాశీనివాస - వాసుఁడు పేర్మిన్. |
42 |
![]() |
![]() |