భాష | నిఘంటువులు | సాంబనిఘంటువు (ఆంధ్రనామనిఘంటువు) |
నానార్థవర్గు | ||
క. |
శ్రీనాయకసాయక వా ణీనాయకముఖ్యవినుత - నీపేరిట నే నానార్థవర్గుఁ జేసెద నానార్థము లొసఁగి ప్రోవు - ననుఁ గృప సాంబా. |
1 |
సీ. |
గుణమున కాటకుఁ - గోపు నా విలసిల్లు గోతికి శాఖ కౌఁ - గొమ్మ యనఁగ శకలంబునకును మా-టకు బలు కన మించు నిసువును గోవె నఁ - బసి యనంగఁ గఱికిఁ బైపూరికిఁ - గ ప్పనఁ జెన్నొందుఁ గొఱ్ఱుకుఁ గడమ కౌఁ - గొఱఁత యనఁగ మగ గుఱ్ఱమునకు గు-ల్మమున కౌ గుం డన నెలకుఁ జాబిల్లి కౌ - నెల యనంగ |
|
తే. |
నూటకును జేవకుఁ దనర్చు - నూటయనఁగ వేఁడుటకుఁ గాఁకకుఁ దలిర్చు - వేఁడి యనఁగ నంకమునకు బిడ్డకును గం - దనఁగఁ బరఁగు లలితమునిమానసాబ్జరో-లంబ సాంబ. |
2 |
సీ. |
ఈఁతచెట్టును లోఁతు - నీఁత యనఁ జెలంగు నజ్జకుఁ గ్రిందిఁ కౌ - నడు గనంగ మాల్మికి నడత కి - మ్మగు నలవా టన నమ్మకు నవ్వ కౌ - నవ్వ యనఁగ గొడుగును మఱునాఁడు - నలరు నెల్లి యనంగ నెఱ్ఱకుఁ దిండి కౌ - నెర యనంగ విరికి నొప్పుటకును - వెలయు నల రనంగఁ బేరును దండ యౌఁ - బే రనంగ |
|
తే. |
నది యనుటకు భంగమున కౌ - నల యనంగ నాత్రమునకు వృత్తమున కౌ - నక్కఱ యన నాలమునకుఁ బలుకుట కౌ - నని యనంగ నంబరధునీ లసజ్జటా-డంబ సాంబ. |
3 |
సీ. |
ములికికిఁ జెఱువుకో-పునకు న ల్గనఁ బొల్చు నైదును దాను నే - నన రహించుఁ జెవిసొమ్మునకును దం-తువుకుఁ బోఁ గనఁ జెల్లు బురిటికి సాటికిఁ - బురు డనఁ దగు నడవికిఁ జూడమి - కగుఁ గాన యనఁ బొల్చుఁ గల్గును ఱాయియుఁ - గ ల్లనంగఁ గంచుకొమ్మునకు శృం-గమున కౌఁ గొ మ్మనఁ బాఁచికి దొంగ కౌ - నాఁ చనంగఁ |
|
తే. |
గరువలికి దయ్యమునకు నౌ - గాలి యనఁగ ఘటికయును దల్పుమల్కునౌ - గడియ యనఁగ నూటికిని మర్దనమున కౌ - నూ ఱనంగఁ జటుల దైతేయమదశైల-శంబ సాంబ. |
4 |
సీ. |
కడుపుగడ్డయుఁ దూము - నడరు బల్ల యనంగ విఱివికి శయ్య కౌఁ - బఱ పనంగఁ గౌముదికిని మ్రొక్కు - కగు వెన్నెల యనంగఁ బగలును గంటు నౌఁ - బగ లనంగ నంగళ్లు నొకపోఁగు - నగును బేఁట యనఁగ నెమిలికి మైత్రి కౌ - నెమ్మి యనఁగఁ బసుపుతావికి వీథి - కెసఁగు వాడ యనంగఁ జలికిని గాలి కౌ - వలి యనంగఁ |
|
తే. |
బట్టునకుఁ గొ మ్మనుటకు నౌఁ - బ ట్టనంగ భేదమునకు మూలమున కౌ - వే ఱనంగ ఫలమునకు వృద్ధునకుఁ దగుఁ - బం డనంగ దాసహృదయకాసారకా-దంబ సాంబ. |
5 |
సీ. |
సాముకూటమునకు - సరస కౌ గరిడి నా సౌరును ములికి యౌఁ - దీ రనంగఁ హయశాలకును బాగ - కమరు ఁ బాగా యన మావి కామ్రమున కౌ - మావి యనఁగఁ గాహళి కొకచెట్టు - కలరు బూరుగ యన ఝడితికి విరతి కౌ - వడి యనంగ హొన్నున కుపకృతి - కొనరు మేల్మి యనంగ మురువును సొగసు నౌ - మురు వనంగ |
|
తే. |
గళుకునకుఁ గంపకోట కౌ - వెలుఁ గనంగ మాను మనుటయుఁ దరువు నౌ - మా ననంగఁ జేవడికిఁ బోలిక కెసంగుఁ - గైవడి యన డమరుశూలపాశాంకుశా-డంబ సాంబ. |
6 |
సీ. |
ఘూకంబునకుఁ జెవి-గూబ కౌ గూ బన శిశువును బులియు నౌఁ - జిఱుత యనఁగ సంధ్యవార్చుటకు సం-జకు సందె యనఁ బొల్చుఁ బక్షియుఁ దరువు నౌఁ - బాల యనఁగ నొకమ్రాఁకునకు వాతె-ఱకు మోవి యనఁ జెల్లు రిక్కయు బొట్టు నౌఁ - జుక్క యనఁగఁ గూరకు శ్వాసాన-కుఁ జెలంగు నూ ర్పన హెచ్చు నెక్కుటయు నౌ - నెక్కు డనఁగఁ |
|
తే. |
గుచమునకుఁ దల్పుచీలకు - గుబ్బ యనఁగఁ బక్కకును గుణపమున కౌ - బడు గనంగ దళసరికిఁ బర్ణమునకు నౌ - దళ మనంగ శంబరాంకకపర్దావ-లంబ సాంబ. |
7 |
సీ. |
లే పన మెత్తకు - లేపుటకుఁ దనర్చు డా లనఁగాఁ గాంతి - డాలుఁ బరఁగు నా డనఁ దగు నాది-నమునకు సీమకు మిం చన జడలకు - మీఱుట కగు మోడి నా నల్కకుఁ - బైఁడితున్కకుఁ జెల్లు బా రన బార యీ-రాఱు నొనరు దండ నాఁ జెంతకుఁ - దామంబున కెసంగు సరి యన దండకు - సమమున కగుఁ |
|
తే. |
దోర మనఁగను స్థూలము - నోముదార మమరు నా ఱిత్తిగయును నూఁ-గారునగును గ్రు డ్డనఁగ నండమున కంధ-కునకుఁ బొసఁగు నంబరతరంగిణిజటా-డంబ సాంబ. |
8 |
సీ. |
కొప్పనంగను వింటి-కొనకును గబరి కౌ నెన్ను నా నెన్నున - కెన్నుట కగు న బ్బనంగను దండ్రి - కగపడమికిఁ జెల్లు నప్ప యనఁగఁ దండ్రి - కక్క కమరుఁ గలు పన మడిలోని-కసవును బెరుఁగు నౌ బా సన నానకు - భాష కలరు డబ్బన గవ్వకు - డంబంబునకుఁ బొల్చు మే లన మరులకు - మెచ్చున కగుఁ |
|
తే. |
బాలగును క్షీరమునకును - భాగ్యమునకుఁ గమ్మ యనఁ బత్త్రికకుఁ జెవి-కమ్మ కెనయుఁ బాప యన బిడ్డకును గను-బాప కెనయుఁ దాపసోత్తమవినుతిక-దంబ సాంబ. |
9 |
సీ. |
వెర యనగాఁ దేనె-పెరకు వింతకుఁ బొల్చు మెఱుఁ గనఁ గాంతికి - మించున కగు బండ నాఁ దిట్టుకుఁ - బలుగురాతికిఁ జెల్లు బంతి నాఁ జెండును - బంక్తియు నగుఁ బెరుఁ గన దధికిని - వృద్ధికిఁ దనరారు వేఁట నా గొఱియకుఁ - వేఁట కమరు వెలి యన బయటికి - వెల్లనకుఁ దనర్చు వీడన వదలును - వీడు నలరు |
|
తే. |
మబ్బనఁగ ముందుసొక్కును - మబ్బును నగు బులు గనఁగ లాంఛనమునకుఁ - బులుఁగు కొదవు నా లనఁగ గోవులకు భార్య - కతిశయిల్లు శంబరాహితమదభిదా-డంబ సాంబ. |
10 |
సీ. |
గురు వన నొజ్జకుఁ - బరువునకుఁ జెలంగుఁ నారి నా యల్లెకు - నాతి కెనయు నూ రనఁ బల్లెకు - నూరువునకుఁ బొల్చుఁ దమి యన రాత్రికిఁ - దమికి నమరు గరి యన దంతికిఁ - గప్పునకుఁ దనర్చుఁ జింత నాఁ దింత్రిణి - చింత యొనరు మూల యనఁగఁ గోణ-మునకుఁ రిక్కకుఁ జెల్లు మను వన బ్రతుకును - మనువును నగుఁ |
|
తే. |
గూట మన శిఖరమునకు - గుంపున కగు జాతి యన నన్వయమునకు - జాతి కెనయుఁ బురి యనఁగ నెమ్మితోఁకకుఁ - బురికిఁ దనరు సకలసురచక్రవర్తి శ్రీ-సాంబమూర్తి. |
11 |
క. |
నిస్తులలక్షణకవి యగు కస్తూరీ రంగసుకవి-ఘటియించిన యీ సిస్తగు నాంధ్రనిఘంటు ప్ర శస్తంబై వెలయుఁగాత - జగతిని సాంబా. |
12 |
క. |
ఈరుచిరాంధ్రనిఘంటు మ హారూఢి వహించి మించి - యారవిశశిభూ తారక మై తారక మై తారక మౌఁ గాత సుకవి-తతులకు సాంబా. |
13 |
![]() |
![]() |