దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
01. గింజజల్లుడు

నాగన్న జల్లుతే
నవ్వుతుందీ మొలకా -

నా రాజు జల్లుతే
నాన్యమీ మొలకా -

రంగన్న జల్లితే
రాజనాలీ మొలకా -

లచ్చన్న జల్లితే
పొంగుతుందీ పైరు -

ముద్దులాంటి ఆ మొలకా
ముత్యాల మొలకా -

కదిపితే రతనాలు
రాల్చేది మొలకా -
AndhraBharati AMdhra bhArati - giMjajalluDu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )