దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
02. పడవపాట

హైలేసో హైలేసో
హైలేసో హైలేసో

అల్లంత గుడికాడ
హనుమంతా గుడికాడ
నావాలా నాపేసీ
హారతూ లిద్దామా.

లంగర్లూ దింపేసీ
దండాలూ పెడ్దామా.

హైలేసో హైలేసో
హైలేసో హైలేసో

బండాడూ మనవాడూ
బలశాలీ మనవాడూ
పడవోళ్ళ పాలీటీ
దండాలా దేమూడూ...

హైలేసో హైలేసో
హైలేసో హైలేసో
AndhraBharati AMdhra bhArati - paDavapaaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )