![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
03. పిలుపు |
తలమీద కొచ్చాడు తండ్రి సూరీడూ! యిలలోన జనులెల్ల యిసిగిపోనారూ! కొడవలీ మొలనుంచి కోత సాలించి రావోయి బే బేగ రంగన్న బావా. మొకమెల్ల కప్పింది ముత్తేల సెమటా ఒల్లెల్ల వొసివాడి కందిపోనాది కొడవలీ మొలనుంచి కోత సాలించీ రావోయి బే బేగ రంగన్న బావా. బంగారు నీ మోము వొసివోడి పోయే ఒల్లెల్ల కందింది వెర్రి నా బావా. కొడవలీ మొలనుంచి కోత సాలించి రావోయి బే బేగ రంగన్న బావా. సెలయేటిలో మునిగి సెవఁట కడిగేసి సరసనూ కూకోని సల్దారగించూ కొడవలీ మొలనుంచి కోత సాలించి రావోయి బే బేగ రంగన్న బావా. |
![]() |
![]() |
![]() |