![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
05. పసిడి పల్కులు |
ఇల్లు కట్టుదామా? ఏమి ఇల్లు? పెంకుటిల్లు ఏమి పెంకు? వార పెంకు ఏమి వార? తామర ఏమి తామర? మెట్ట తామర ఏమి మెట్ట? కొండమెట్ట ఏమి కొండ? బొగ్గు కొండ ఏమి బొగ్గు? నేల బొగ్గు ఏమి నేల? గచ్చు నేల ఏమి గచ్చు? పాల గచ్చు ఏమి పాలు? బర్రె పాలు ఏమి బర్రె? చుక్క బర్రె ఏమి చుక్క? చారు చుక్క ఏమి చారు? బియ్యపు చారు ఏమి బియ్యము? ఊచ బియ్యము ఏమి ఊచ? జొన్న ఊచ ఏమి జొన్న? మొక్క జొన్న ఏమి మొక్క? మామిడిమొక్క ఏమి మామిడి? అంటు మామిడి ఏమి అంటు? అల్లె అంటు ఏమి మల్లె? గుండు మల్లె ఏమి గుండు? ఇనప గుండు. |
![]() |
![]() |
![]() |