దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
06. కోకిలపాట

కాకులే దూరనీ
కారడవిలోను
కాపురం చేస్తినే
కాకమ్మ నేను
చీమలూ దూరనీ
చిట్టడవిలోనూ
చీకు చింతా లేక
వున్నాను నేను.
ఇల్లయిన కట్టలేని
ఇల్లాల్ని నేను
పిల్లల్ని పెంచలేని
పెద్దమ్మ నేను ...        ॥కా॥

దక్షిణాయనం
వచ్చింది
తల్లియింటికెల్లి
దక్షినాయనం
వెళ్లాక
మళ్లివస్తానే ...        ॥కా॥

కోయిలమ్మ వచ్చింది
కోనల్లుదాటి
చిలకమ్మ చెప్పింది
అమ్మతోపోయి
కోయిలమ్మ వెళ్లింది
కోటలెల్ల దాటి.
నెమలి ఎదురెల్లింది
నేరుపుగ పిలువ
మల్లెలూ పూచాయి
మా పెరటిలోనూ
మావిళ్లు చిగిర్చాయి
మా తోటలోనూ.
మనమంత వాసంతం
బాగ గడపాలి ...        ॥కా॥

నీవు పాడు పాటలకు
రాలైన కరుగు
నేను చేసే నాట్యానికి
మనసెల్ల కరుగు ...        ॥కా॥

పుట్టిన యింట
హాయిగ ఆడీ, పాడీ
అత్తారింటను
నోరుమూసుకో
కొర్రాటెన్నూ
తాటీపండూ
సారీ తీసుకువెడ్తాను
మళ్లీ ఆరునెల్లకొస్తాను
నను మరువకండీ ...        ॥కా॥
AndhraBharati AMdhra bhArati - kookilapaaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )