![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
07. మరువలేనే |
అందాలాదానా ఆనందాపూ దానా చారెడూ కళ్ళాదానా మిసిమీ వన్నేలాదాన బంతులా బుగ్గాలాదానా నిన్ను నేనూ మరువమన్న మరువాలేనే నిన్ను మరువమన్నా మరువాలేనే ధవళాపళ్ళావరుసాదానా అందచందాలదానా తేనెలొల్కే పల్కులదానా నాతీనడకలాదానా చంద్రాచూపులాదానా హంసానడుమూలాదానా తీరైనా కనులాదానా నిన్ను నేనూ మరువమన్నా మరువలేనే నిన్నూ - మరువమన్నా మరువలేనే |
![]() |
![]() |
![]() |