దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
11. నిరాశ

ఎన్నళ్ళు పాటుబడిన
ఈ గుణపమే మిగులు
ఎందుకోయి యీజన్మ ఓరన్నా
కంటరాక్టరు మేడ
కలకటేరూ మేడ
కట్టించుకు కష్టపడక
సౌఖ్యాలూ పొందుతుంటె
ముందూ మనకేదంచు
మోసాపోతూ ఉంటే
ఎండసిగనో మాడుతున్న
గంజిముంతకు బరువులేదు
గంగమ్మతల్లి చలువకు
తిరుగు లేదూ
AndhraBharati AMdhra bhArati - niraasha jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )