![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
13. దంపు పదాలు |
వానాదేముడ నీకూ వరుసా చెల్లెల్నీ వర్షాలూ కురిపించో వరిచేలాలోనూ. పండాయీ మాచేలూ పండంటే మా చేలూ నూర్పించీ తెచ్చారూ నూరూ గరిసెల్లూ పండించీ తెచ్చారూ పంటా కాపుల్లూ. ఎక్కాలేనీ గట్లూ దిగలేనీ మెట్లూ. చూలింతా పోశారూ చుక్కాలా పొడుగూ. బాలింత పోశారూ పర్వతాలా పొడుగు నూనెతో పులగామా మా ఎడ్లే మేసేయీ. |
![]() |
![]() |
![]() |