![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
14. దున్నేపాట |
బిక్కవోలు భీమయ పొలము ముప్పయి మూడెకరాలు కౌలుకయిన రాసుకుందామా మనదున్నపిల్లని సరదాగా దున్నుకుందామా. కోటిపల్లి తీర్థమెల్లి కోటిగొనుపుల కర్ర తెచ్చి సిన్నములేద్దామా మన దున్నపిల్లను సరదాగ దున్నుకుందామా. వాకాడ సంతకెల్లి వాటమైన కర్ర తెచ్చి సిన్నములెద్దామా మన దున్నపిల్లని సరదాగా దున్నుకుందామా. వచ్చే వట్టి గడ్డి పండే పెసర పొట్టు దున్నే దున్నకు పెడదామా మన దున్నపిల్లని సరదాగ దున్నుకుందామా. దుక్కే దున్నపిల్ల ఎక్కే ఎడ్ల బండి పల్లె పాట పాడుకొందామా మన దున్నపిల్లని సరదాగా దున్నుకొందామా. |
![]() |
![]() |
![]() |