![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
18. సిన్నీ - సూరి |
మా సిన్నీ సూసింది మంచి కుర్రోణ్ణి మనసైతే యిచ్చింది మాటాడలేదు కులముగలవోడమ్మ గునముకలవోడు వాయిలేనోడమ్మ మారైతుబిడ్డ మారాణి మా సిన్ని మారాజు వాడు సిన్నిసూసిన సూపు సిగ్గూల సూపు సూరి సూసిన సూపు సూదుల సూపు సూపు కలిపేనమ్మ చిన్ని మా సిన్ని మాటగలిపేడమ్మ మంచోడు సూరి సూరి సిన్నులు కలసి సరసమాడంగ మబ్బుల్లో సెంద్రుడూ సిగ్గుపడ్డాడు సుక్కలన్నీ గూడి పక్కున్న నవ్వి తలంబ్రాలు సల్లేయి తలమీదానూ ... |
![]() |
![]() |
![]() |