![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
19. చెరుకుతోట పాట |
నీది బాగుందె బుచ్చప్ప సెరుకు తోట రంగు రంగూలకర్ర గుంపూ గుంపూలకర్ర నీది బాగుందె బుచ్చెప్పా బాగుందె సెరుకుతోట బాగుందె ... వ. ఎందుకు బాగుండదు? ఉన్నవారైదుగురు కూకుంటే యెడతారు నిలబడితే యెడతారు తోటకి నీరు యెడతారు నాది మేటేసుకుపోనాది బుచ్చెప్పా మేటేసుకు పోనాది సెరుకుతోట మేటేసుకు పోనాది వ. ఏటిపిల్లా నీకర్మం? ఉన్నవాడొక్కాడు వోటోడై పోనాడె బుచ్చప్పా వోటోడై పోనాడె ఎక్కమంటె ఎక్కనేడు యాతం నడువులు నొప్పంతాడు కాళ్ళూ రావంతాడు నా గెహచారం కాలిపోను మేటేసుకు పోనాది నాది బుచ్చప్పా మేటేసుకు పోనాది సెరుకుతోట మేటేసుకు పోనాది నీది బాగుందె బుచ్చప్పా సెరుకు తోట |
![]() |
![]() |
![]() |