దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
20. చందమామో?

చందమామో
ఓ చందమామో
రాత్రికి రాత్రికి
వస్తావనీ - చందమామో
రాతీగంధం
తీసీ ఉంచితి - చందమామో
ఎప్పూ డెప్పుడు
వస్తావోననీ - చందమామో
ఎలగా చెట్టు
నీడానుంటి - చందమామో
ఇప్పూడిప్పుడు
వస్తావాని - చందమామో
ఇప్పాచెట్టూ
నీడానుంటీ - చందమామో
ఇప్పుడెప్పుడు
రాకుంటేనూ - చందమామో
ఇప్పాపువ్వే
రాలినాదీ - చందమామో
మల్లీమరళి
వస్తావానీ - చందమామో
మల్లీపొదనా
నిలచీయుంటీ - చందమామో
మల్లీపొదా
మాటలువినీ - చందమామో
మల్లీపువ్వే
రాలీనాదీ - చందమామో
AndhraBharati AMdhra bhArati - chaMdamaamoo? jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )