![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
21. వియ్యపురాలి పాట |
మంగళం జయా మంగళం మా ఒదినెగారీ వన్నెలాకూ జయామంగళం వన్నెలాడి వదినెగారూ వయ్యారముతో పెండ్లికి వస్తే పెండ్లిపందిరి గడగడ వణికే దీపములన్నీ తలలువంచే ... ॥మంగళం॥ చక్కని మా వదినగారూ వంకర నడకతో కూలాబడితే ప్రక్కనున్న మరదలు వెళ్ళి ఎత్తి నిలపీ మన్నూ దులపే... ॥మంగళం॥ మడికట్టుకు ఒదినెగారూ తులసీపూజకు వెడుతూవుంటే గాలివేసి పయిట ఒసవే కూతురు వెళ్ళి పైటాదిద్దే ... ॥మంగళం॥ ప్రేమాతో అరటీపండూ వియ్యపురాలీ చేతికిస్తే తినుటా ఎరుగని వియ్యపురాలు తొక్కతొమ్రింగి కక్కూకొనెనూ ... ॥మంగళం॥ చింతమానూ చిగురూచూడూ మూతి తిప్పుచు మాటాలాడుచు వయ్యారముతో నడకే చూడు ... ॥మంగళం॥ |
![]() |
![]() |
![]() |