![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
22. బస్తాపాట |
వస్తావటోలె పిల్ల వస్తావంటే నిన్ను వరంగల్లు తీసుకుపోత వస్తావంటే. నన్ను వరంగల్లు తీసుకుపోతే వస్తానుగానీ మనదారిఖర్చు దప్పిఖర్చు తెస్తావటోయి. మనదారిఖర్చు దప్పి ఖర్చు తెస్తానుగాని అడుగుదాటకుండ మాతయింటూ ఉంటావటే. అడుగుదాటకుండ మసలుకుంటువుంటానుగాని మాటపేచేరాకుండగాను చూసుకుంటావా. పోటీరాకుండగాను చూసుకుంటానుగాని పోకిళ్ళు పోతావుంటే కూకలెడ్తాను. |
![]() |
![]() |
![]() |