దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
24. అలక పాన్పు

రావోయి రంగనాధ
నాగవల్లికీ ...
రానండి మామగారు
నాగవల్లికీ ...
పొద్దెక్కిపోయింది
పోరుపెట్టకోయి
వర్షాలు వస్తాయని
వర్జులన్నారూ ...
మూడుకాసుల
మురుగులిస్తే
లేచివస్తానో ...
అష్టావర్ణం పెంచీనేను
పిల్లా నిస్తీని
ఏమీ యిచ్చిన
నీకూ ఉండవు
లేచీరావోయీ
కన్యతోటీ నీవూ బాగా
కదిలీ రావోయీ ...
బావా మరదలు
బెల్లం ముక్కలు
తెస్తూ ఉన్నారూ
అలకతీర్చీ గడ్డం క్రింద
బాగా తడ్తారూ ...
మరదళ్ళంతా బుక్కా తెచ్చీ
వేచీ వున్నారూ
నిన్నూచూస్తే
సిగ్గూతోటీ
తలలూ వంచారూ ...
AndhraBharati AMdhra bhArati - alaka paanpu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )