![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
25. కూపు పాట |
ఏటోరిబాబూ సీటి మాటీకి సీటి సూపమంతరూ మాటి మాటీకి తణికి సేత్తమంటరూ సీటి లేకుండా రాలేదు కూపుకూ అడ్డాకుకూ ఎవు డోలెంకీ ఆ సోకుదారు నాయాలు? ఏమిటమ్మా నిల్దీసి అడుగుతుండు? ఎవురునేదే మన చింగంపిల్చెంకన్న మనవఁడు ఈ మద్దెన పారెట్టు గాడ్డయినాడు. దించునీదీ నెత్తి బరువు సూపించు నీది సీటి పిల్ల కూపు సీటి కాకపోతే ఆపు సేత్త నమ్మీ కేసు పూపు సేత్తనమ్మీ. పూపుసేసినట్టే వున్నావుబాబూ. అడ్డాకుల మూటబాబు సెడ్డా బరువుంది బాబు ఎత్తితె దించలేము దించితె ఎత్తలేము సెప్పరాని కాడుంది ఇప్పిసూసుకో సీటి ఏం సెయమంటావ్ పిల్లా ఉద్దోగ దరమం ఒడినొడతలు పడి సీటి తడిసిందేవఁమ్మా? బాబు సేతికి తడి తగిలిందా? మీదనున్నయ్ గదు పిల్లా యిత్తిరాకులు - ఆటికి రాసేత్తాను ఒద్దోయ్ బాబు గాడ్డుబాబు మేటి బాపనోళ్ళు గూడి సాటిలేని తిండివొండి సంతరపన తింతారు మంచిది యీ అడ్డాకు ఏటోయి బాబు సీటిమాటీకి సీటి సూపమంతరూ మాటి మాటీకి తణికి సేత్తమంతరూ సీటిలేకుండా రాలేదు కూపుకూ, అడ్డాకుకూ... |
![]() |
![]() |
![]() |