![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
26. చేనుకోత |
పుట్టమీదా పాల పిట్టోయి నాసామి కొట్టబోతే తేలు కుట్టేనోయ్. మంతరించే జాన లుంటే నాసామి మల్లెమొగ్గా పాను పేతూ నోయ్. నేలానేలా నెల్లి కూరోయి నాసామి పాలపాలా బలుసు కూరోయీ. వాలుగొమ్మ చింత సిగురోయ్ నాసామి వండిపెడితే వలపుతీరేనోయ్. అరుగుమీదా అరటిపండోయ్ నాసామి పండుమీదా మనసు లుంటే నాసామి పంతమేస్తే పండురాదోయీ ఎర్రచెరువూ గట్టు కాడా నాసామి చెప్పరానీ దుఃఖ మొచ్చిందోయ్. ఎడ్లకేసే పోలి కేకా నాసామి నాకు యేస్తే నేను రానోయీ. సూపులేలా నీకు పోరా నాసామి మాటలుంటే చేరి చెప్పోయీ. |
![]() |
![]() |
![]() |