దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
28. తొక్కుపలుకులు

కొలువకు పోదాం
వస్తావా
ఏం కొలువ?
రాజు కొలువ
ఏ రాజు?
అడవి రాజు
ఏ అడవి?
చిట్టడవి
ఏం చిట్టు?
సొర చిట్టు
ఏం సొర?
మంచి సొర
ఏం మంచి?
కాయమంచి
ఏం కాయ?
అరటికాయ
ఏం అరటి?
ఉక్కు అరటి
ఏం ఉక్కు?
నీ ముక్కు...
AndhraBharati AMdhra bhArati - tokkupalukulu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )