![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
30. పొలిపదం |
ఒలే ఒలియ ఓలియో ఒలియా రా వేలుగలవాడా రార పొలిగాడ రావేలు పోబేలు రాశిపదివేలు రావేలు నీదయ్యా రావిమాదయ్యా పదివేలు గలవాడ రార పొలిగాడా పదివేలు నీదయ్య పంటమాదయ్యా నూర్వేలు గలవాడ రార పొలిగాడా నూర్వేలు నీదయ్య నూగుమాదయ్యా వెయ్యేలు గలవాడ రార పొలిగాడా వెయ్యేలు నీదయ్య వెన్నుమాదయ్యా కోటివేల్గలవాడ రార పొలిగాడా కోటివేలు నీదయ్య కొండ్రమాదయ్యా పోయెనే పొలిగాడు పొన్నూరుదాటి వచ్చెనే పొలిగాడు పరగాణి బాట వామెక్కి పొలిగాడు వాలలాడంగా కుప్పెక్కి పొలిగాడు కూకవేయంగా మఱ్ఱెక్కి పొలిగాడు మాటలాడంగ జువ్వెక్కి పొలిగాడు జూదమాడంగ పోతెక్కి పొలిగాడు బొబ్బటిల్లంగ రాసెక్కి పొలిగాడు రంపటిల్లంగ పొలిగాడు గొట్టంగ పోగాయె రాశీ పెయ్యీలు త్రొక్కంగ పెరిగెనే రాశి ఎద్దులు ద్రొక్కంగ మెదిసెనే రాశి దున్నలు ద్రొక్కంగ నన్నాయె రాశి కోడెలు ద్రొక్కంగ కొదిసాగె రాశి కొండవీటి కొండెల్ల దొప్పాయ రాశి తిరుపతి కొండల్లె తీరెనే రాశి రామలక్ష్మణులట్ట రాశులు గలవు. |
![]() |
![]() |
![]() |