![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
32. పల్లెమామా |
పడవాపు పడవాపు పల్లెమామా పడవొడ్డు కట్టించు పల్లెమామా పచ్చి చాపల గంప పల్లెమామా బరువుగా వుందోయ్ పల్లెమామా ఓఓఓ పల్లెమామా ... ॥ప॥ ఏ వూరు దానవే ఎర్రదానా ఏ జాతి దానవే పొట్టిదానా నడేట్టో పడవకీ పడుచుదానా గట్టులేదు పుట్టలేదు పల్లెదానా ... ఒడ్డూకడకు చేర్చుతాను పల్లెదానా ... ॥ప॥ తెరచాప ఎత్తకోయి షరంగు మామా లంగరేసి పడవాపు షరంగు మామా సందె చీకటి పడ్డాది షరంగు మామా గడవేసి ఒడ్డికిరా షరంగు మామా ... ॥ప॥ పడవొడ్డుకు వచ్చింది పల్లెదానా గంప దింపుతాను రాయె పల్లెదానా నా జాతి దానవనీ పల్లెదానా ముందుగా చెబితెను పల్లెదానా ముందుగా ఎక్కుదూవె పల్లెదానా ... |
![]() |
![]() |
![]() |