దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
36. అమ్మన్న

అమ్మన్న ముద్దనూ
ఏ మన్నారూ
అచ్చనావుల
పాలన్నారూ
అప్పుడు కాచిన
నెయ్యన్నారూ
దోరగ వేగిన
గారన్నారు
పాకము వచ్చిన
అరిసెన్నారు
పటిక పంచదార
పొడుమన్నారు.
AndhraBharati AMdhra bhArati - ammanna jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )