![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
37. వేరుశనగ |
గంపేడు కొడుకులతో వేరుశనగమ్మా నీవు భూమీన పుట్టేవె వేరుశనగమ్మా నీపుట్టిళ్ళు బొంబాయి వేరుశనగమ్మా ఎగుమాతి కాకినాడ వేరుశనగమ్మా నిన్నవాళ్ళు పెద్దవోళ్ళ వేరుశనగమ్మా నిన్నేలెట్టి కెలికారు వేరుశనగమ్మా ఆ పెద్దపెద్ద రైతులకూ వేరుశనగమ్మా చిప్ప చేతికిచ్చావు వేరుశనగమ్మా ఆ తూరుపోళ్ళందరికీ వేరుశనగమ్మా తీగనాణు తెచ్చావు వేరుశనగమ్మా రెడ్డోరు నినుచాలా వేరుశనగమ్మా రెండూ చేతులమోశారూ వేరుశనగమ్మా జాతివోడు నిన్ను చాలా వేరుశనగమ్మా చలకేగ ముద్దులాడె వేరుశనగమ్మా కాకినాడ బుడంపేట వేరుశనగమ్మా బంగారు పేట అయినాదె వేరుశనగమ్మా కోనసీమ కంటానూ వేరుశనగమ్మా కోరీ వరించిందే వేరుశనగమ్మా వేరుశనగమ్మ - వేరుశనగమ్మా. |
![]() |
![]() |
![]() |