![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
38. సిన్నీ - బావా |
సిన్నీ నా సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ పొన్నపూల సిన్నీ నీ యన్నమీద ఆన న న్నేలుకోవే సిన్నీ ని న్నొదిలి వుండలేను. బావా నా బావా బంగారుముద్దుల బావా నే కన్నెపిల్లదాన్ని నా కన్నవారి తోడు ఎన్నటికీ నిన్నే నే నేలుకుంటానోయి ఉన్నదాన్ని గాను నా ఉసురుబోసుకోకు. సిన్నీ నా పొన్నీ నే సిన్నవోణ్ణిగానే సిన్న జమీలున్నవోణ్ణి నిన్ను కన్నులలో పెట్టి కలకాలం పూజిస్తా మీ యన్నలతో సెప్పి న న్నేలుకోవె సిన్నీ. నీకన్న యెవురు నాకు నే సిన్నదాన్ని గాను మా యన్నలతో సెప్పి అందాల బావ నన్ను ఏ అడ్డు సెప్పకుండా న న్నొడ్డుసేయి బావా నా కన్నవారి తోడూ నా కంటి కునుకులేదూ నీ జంటమీద ఆసే ఒంటారితనము రోతే న న్నింటిదాన్ని సెయ్యి. |
![]() |
![]() |
![]() |