దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
39. తత్త్వం

జ్ఞానీ ఎరుగు
సుజ్ఞానీ ఎరుగు
మంచీ నీళ్ళారుచి
మత్స్యా మెరుగును కాని
గుట్టాలంపట తిరిగే
కోడి ఏ మెరుగూ ...

పిల్లాలా ఆకలి
తల్లీ ఎరుగును కాని
అడవులంట తిరిగే
అయ్య ఏ మెరుగూ ...

భార్యా చేసిన తప్పు
భర్త ఎరుగును కాని
వీధులంట తిరిగే
జోగీ ఏ మెరుగూ ...

మల్లెపూల రుచీ
తుమ్మెదెరుగును కానీ
మనమీదా వాలేటి
ఈగా ఏ మెరుగూ ...
AndhraBharati AMdhra bhArati - tattvaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )