దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
40. ఎట్టా పోనిత్తురా

కందిరీగ నడుముదాన్ని
ఎట్టా పోనిత్తురా?
బెదురూ చూపూలదాన్ని
ఎట్టా పోనిత్తురా?
తుమ్మేద నెరులదాన్ని
ఎట్టా పోనిత్తురా?
అట్టాటిట్టాటి దాన్ని
ఎట్టా పోనిత్తురా?
AndhraBharati AMdhra bhArati - eTTaa poonitturaa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )