దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
41. రవఁసిలక

మగ: రంసుబలే రావఁసిలకా
        అబ్బదాని సోకో జబ్బల
        మీద జాకేట్టు

ఆడ: ఆదివారం సంత
        యీ అందెల్‌ కడాలెంతా?

మగ: ఏసుకోరాదా
        ఏడణాలివ్వరాదా ...

ఆడ: శుక్రోరం సంత
        యీ సందెడుగాజు లెంత?

మగ: తొడుక్కోరాదా
        తొమ్మిదణాలియ్యరాదా ...

ఆడ: మంగళోరం సంతా
        యీ మంచిముత్తాలెంతా?

మగ: మలుసుకోరాదా
        ముప్పావలివ్వరాదా ...
AndhraBharati AMdhra bhArati - rava.rsilaka - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )