దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
44. ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు
ఏ వూరెళ్ళింది ఏనుగు
ఉప్పా డెళ్లిం దేనుగు
ఉప్పునీళ్ళు తాగిం దేనుగు
మన వూరి కొచ్చిం దేనుగు
మంచినీళ్ళు తాగిం దేనుగు
అంబారేసిన ఏనుగూ
అబ్బాయిని మోసిం దేనుగు.
AndhraBharati AMdhra bhArati - eenugu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )