దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
45. వేవిళ్ళపాట

నెలవెళ్ళ పొద్దాయె మొగడా
నెలబాలు డుడ్తాడు మొగడా
వేవిళ్ళు వచ్చాయి మొగడా
కోరినవి పెడ్తావ మొగడా

నేను పెట్టకపోతే ఓసీ
నీకెవరు పెడ్తారు ఓసీ
కోరికలు చెప్పవే ఓసి ...

ఆరు వెలగాపళ్ళు నాకూ
అవి తెచ్చిపెట్టు
ఓ మగడా
అరటిపళ్ళూ మంచి
దానిమ్మ పళ్ళు
వాటిమీద పోయింది
నామనసు
మొగడా ...
వేడుకలు చేయాలి
మొగడా
వేవెళ్ళ వెలక్కాయలు
మొగడా
చూలింత చుట్టయిన
మొగడా
అవి పంచిపెట్టాలి
మొగడా ...
పొద్దున్నే లేచాడు
మొగుడూ
మంచిదీ చూసుకొని
మొగుడు
పైనమైపోయాడు
మొగుడూ ...

సూర్యుడూ పొడిశాడు పాపం
చూలింత లేచింది పాపం
గంతలో కెళ్ళింది పాపం
ఇంటిలోకి రాకూడదు పాపం ...

రాత్రికి వచ్చాడు పాపం
అన్నీని పట్టుకొని పాపం
ఓసీ, అని పిల్చాడు పాపం
ఇంట్లోకి రాకూడదు పాపం ...

వేవిళ్ళు అని నన్ను ఓసీ
ఎంత భయపెట్టావే ఓసీ
ఒకరోజుకా యింత మోసం
నీకు తెలియకపోతే ఓసీ
నాకయినా బుద్ధిలేదా ఓసీ ...
AndhraBharati AMdhra bhArati - veeviLLapaaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )