![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
46. జోలపాట |
జోలల్లు పాడితే బాలలకు నిద్ర నాగస్వరం పాడితే నాగులకు ఆట చిట్టీ చిట్టీ చిట్టి చీమల్లమఱ్ఱి మఱ్ఱికిందవాడు తొఱ్ఱినాగన్న తొఱ్ఱినాగన్నకీ తోడెవ్వరమ్మా గోవుల్ని కాచేటి గోవిందుడే తోడు అమ్మాయి నెవ్వరే కొట్టిన్నవారు కొట్టి గోవుల పాలు కొనిపోసినారు చిన్నారి పొన్నారి చిలుకవే నీవు చిన్నమామిడి క్రింద చిన్నకోవెలవు ఏడవకు ఏడవకు వెర్రి అమ్మాయి ఏడిస్తె నీకళ్ళు నీలాలుగారు నీలాలుగారితే నేజూడలేను పాలైనగారవే బంగారుకండ్ల హాయి హాయిహాయి ఆపదలుగాయి చిన్నవాళ్ళనుగాయి శ్రీవెంకటేశ. |
![]() |
![]() |
![]() |