![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
47. ఓ బావా |
ఓ బావ ఓ బావ ఓ బావా, ఒడియాలు తింటావా ఓ బావా ... మరదల మరదల ఓ మరదలా ఒడియాలు తినలేను ఓ మరదలా ... ఓ బావ ఓ బావ ఓ బావా, పాలైన పిండగలవ ఓ బావా ... మరదల మరదల ఓ మరదలా బర్రెలంటె భయమోలె ఓ మరదలా ... ఓ బావ ఓ బావ ఓ బావా, చేలోను వంగగలవ ఓ బావా ... మరదల మరదల ఓ మరదలా చేనుకోత మహసరద ఓ మరదలా ... ఓ బావ ఓ బావ ఓ బావా, రావయ్య చేలోకి ఓ బావా ... మరదల మరదల ఓ మరదలా ఉసారుగా ఉండాదె ఓ మరదలా ... |
![]() |
![]() |
![]() |