దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
48. పొలిపదం

ఒలియో ఒలియా ఒలియా
వేలుగలవాడా రారా పొలిగాడా
ఊరికి ఉత్తరాన ఊడల మఱ్ఱి
ఊడలామఱ్ఱిక్రింద ఉత్తముడిచేతికె
ఉత్తముడి చెబికెలో రత్నాలపందిరి
రత్నాల పందిట్లో ముత్యాలకొలిమి
గిద్దెడు ముత్యాల గిలకలా కొలిమి
అరసోలముత్యాల అమరినా కొలిమి
సోలెడుముత్యాల చోద్యాల కొలిమి
తవ్వెడు ముత్యాల తరచినా కొలిమి
మానెడు ముత్యాల మలచినా కొలిమి
అడ్డెడు ముత్యాల అలచినా కొలిమి
తూముడు ముత్యాల తూగెనే కొలిమి
చద్ది అన్నముతినీ సాగించు కొలిమి
ఉడుకు అన్నముతిని ఊదెనే కొలిమి
పాల అన్నముతిని పట్టెనే కొలిమి
ఊదేటి తిత్తులు ఉరుములామోలు
వేసేటి సంపెట్లు పిడుగులామోలు
లేచేటి రవ్వలు మెరుపులామోలు
చుట్టున కాపులు చుక్కలామోలు
నడుమకమ్మరిబిడ్డ చంద్రుణ్ణి బోలు ...
AndhraBharati AMdhra bhArati - polipadaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )