![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
49. బస్తా దిగుమతి |
హై లెసోయల్ల హైలెసో ఓ చూరుకాడ హైలెసో ఓ పిల్లాదాన హైలెసో ఓ పెళ్ళిచేసుకుంటే హైలెసో ఆ పెద్దకాసులదండ హైలెసో ఆ పెట్టేదగానీ హైలెసో ఆ చుక్కారయికా హైలెసో ఆ కుట్టించిపెడ్తూను హైలెసో నీసన్న సన్నానీ హైలెసో నీనడుముకూ హైలెసో నేనొక్క ఒడ్డాణం హైలెసో నేసేయించిపెడ్తాను హైలెసో |
![]() |
![]() |
![]() |