![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
50. పచ్చగడ్డి పాట |
పచ్చగడ్డి కోసేటి పచ్చని పిల్లా పయిటకొంగు జారిందే పలుచని పిల్లా. పచ్చల్ చొక్కాయేస్ని పచ్చని బుల్లోడా పయిటలోనె వున్నాది పచ్చని చిలుకా. పచ్చాని చిలుకంటె పరదాలెగురుతాను చేతికందిందంటె చెప్పలేనా సోకు. చిలుకలంటే యేటో చిందులేతుండావు పచ్చగడ్డి బీడులో పరుగులాడి పట్టరా. |
![]() |
![]() |
![]() |