![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
52. కోడలి పాట |
మా యింటి కోడాలు మంచి ముత్తాము సీటిమాటికి తాను సీరాకు పడదు పెందలాకడ లేచి పాసి చేసేసి యిల్లలికి ముగ్గెట్టి యీదిలో తుడిసి కల్లాపు జల్లేసి గొడ్లమేతేసి నీలాటి రేవుకు నెమ్మదిగ బోయి నీళ్ళు తెత్తాదమ్మ నిత్తె ముత్తైదు అత్తమామాలాకు ఎత్తళ్ళుబెడ్తు పెనిమిటిని సిరికంట పలకరిత్తాది మరుదులను మంచిగా మందలిస్తాది తోడికోడళ్ళనూ తోటోళ వలెనే గౌరవిత్తాదమ్మ గౌరమ్మ తల్లీ. |
![]() |
![]() |
![]() |