![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
54. శ్రీకృష్ణుడుమీద |
ఎవ్వరేనా స్వామి నవ్వుల్లతండ్రి నవ్వుముఖముతో నాతండ్రి కృష్ణా పువ్వుటుయ్యాలలోను పొంగి యూగుమురా నిద్రపో నిద్రపో నీలవమందా బలభద్రు తమ్ముడా హరి నిద్రపోరా నిద్రకూ వెయ్యేండ్లు నందగోపకుమారా నవనీతచోరా మంధరగిరిధారా ఏడువకు కృష్ణా ఏడువకు నాతండ్రి ఏడువకు కృష్ణా పాడి యూచెద నిన్ను బాలగోపాలా |
![]() |
![]() |
![]() |