దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
55. ప్రశ్నలు

వడ్లు పండించావు ఓనాథా
యిపుడు వడ్లలో వరి పొల్లు
ఎందుకున్నాది?

మారుదేశామెల్లి
మగువులతోగూడి
మళ్ళకే నీరెట్టి
మరచితివి రాజా.

కూడువండీ నావు
ఓ కుసుమగన్నీ
కుండపై సారల్లు
ఎందుకున్నాయి.

నల్లకొండానుంచి
నా తమ్ములొస్తే
మాటలా మధ్యనా
మరచితిని రాజా.

అరటి ఆకులమీద
వడ్లెండబోసి
అరుగెక్కి నే చూసె
అయ్య బలముమ్మ
మానాన్న వేసిన చేను
ఏమి పండింది?
రాజసము పండింది
రాసులవగోరిందీ
మా తాతవేసిన చేను
ఏమి పండింది
తప్పలై పండింది
తాలు కోరింది.
AndhraBharati AMdhra bhArati - prashnalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )