![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
57. గుమ్మాడి పాట |
గుమ్మాడమ్మ గుమ్మాడి పందిరే ఎక్కింది గుమ్మాడి చిగురే వచ్చింది గుమ్మాడి ఆకులే వేశాయి గుమ్మాడి పువ్వులే పూచాయి గుమ్మాడి కాయలే కాచాయి గుమ్మాడి పండు గుమ్మడికాయల్లు పచ్చబడ్డాయి నాన్నతో చెపుతాము రార తమ్మూడా అక్కతో నేనొక్క మాట చెబుతాను అంత పెద్దకాయల్లు తీగెల్ల మోసె? తీగ కాయకు బరువు అని చెప్పలేదా మన అవ్వ మన తోటి మరచిపోతీవా అమ్మరో దప్పళం బాగవండావే నాకెంత యిష్టమో నీకు తెలుసూనె ... |
![]() |
![]() |
![]() |