![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
59. చాకిరేవు పాట |
మంగమ్మా ... సాకిరేవు బల్లకాడ సంగతీ నీ సక్కదనము కాలిపోను సుక్కలాటి మంగమో ... ॥స..॥ నున్నని బల్లమీద సాగతీసి కొడుతుంటే మంగమా ... ॥స..॥ సాగతీసి కొడుతుంటే బట్టలు కొడుతుంటే నీ కష్టము సూసీ మనసు ఇష్టపడది మంగమో ... ॥స..॥ తాజాగా తాటికల్లు మజాగా మాపిటికీ మాయవరం సంతలోన మారిపోదాం మంగమో ... ॥స..॥ |
![]() |
![]() |
![]() |