![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
61. రంగం పాట |
మగ: నే రంగమెల్లిపోతానె నారాయణమ్మ నాను నబ్బరెల్లిపోతానె నారాయణమ్మ ఆడ: పోతేపోయావు గాని నాయుడుబావ నాకు పోగులజత తెత్తావా నాయుడుబావ మగ: పోగులజత తెత్తేను నారాయణమ్మ నువు పొంగిబోర్లపడతావే నారాయణమ్మ ఆడ: కాసులపేరు తేవోయి నాయుడుబావ నాకు కంటె తెచ్చిపెట్టవోయి నాయుడుబావ మగ: కాసులపేరు తెత్తేను నారాయణమ్మ నా ఆశలన్ని తీరుత్తావ నారాయణమ్మ |
![]() |
![]() |
![]() |