![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
65. చెరువు నుంచి |
ఈ యూరి కుమ్మరి యిల్లు నే నెరుగ చెయ్యాలి కుమ్మరి గజ్జెల్ల కడవ గజ్జెల్ల కడవికి ఏ బావి నీళ్ళు పేరైన యిసుకాల పెదబావి నీళ్ళు బుడుగు బుడుగున ముంచి మోకాట బెట్టి అక్కడిక్కడ చూచి కట్టపై చూచి కట్తమీద పొయ్యేది ఎవరయ్య మీరు కట్టమీద పోయేటి గాజుల్ల సెట్టీ నేనొచ్చి తడవాయె కడవెత్తవయ్య కడవపేరు ఏం పేరు నీపేరు ఏమి కడవపేరు గంగమ్మ నాపేరు సీత అయిపోయె గౌరమ్మ అయిపోయెనమ్మ ఐపైన గిరిమీద అడిగిరావమ్మ మా జొన్నలయిపోయె మేము పోతాము మళ్ళొచ్చి నీ పాటలెల్ల పాడేము. |
![]() |
![]() |
![]() |