![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
66. పురిటింటి పాట |
మా యింటి పురిటాలూ ఏమీ కోరిందీ కుక్కీ మంచమ్మూ గూనా కుంపాటీ ... తొలుచూలు కొడుకూనీ కానాకోరిందీ ... ఎర్రని తాంబూలం కాటుక కోరిందీ ... చక్కని పిప్పాలీ ఖాయం కోరిందీ ... ఉల్లీ ఖారమ్మూ శొంఠీ కోరిందీ ... చక్కని సలువాలూ కట్టాకోరిందీ ... ఏటా చూలింతా బాలింత కోరిందీ ... |
![]() |
![]() |
![]() |