![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
67. ఏరువాక |
వేర్చి కట్టేరు ఎల్లెడ్ళ బంతి ప్రొద్దున్న కట్టేరు బొల్లెడ్ల బంతి వెండికన్నెలకట్టేరు ఎల్లెడ్లబంతి పయిడికన్నుల కట్టేరు పైయెడ్లబంతి బొడ్డుకన్నెల కట్టేరు బొల్లెడ్లబంతి కంచుకన్నెలకట్టేరు కర్రెడ్లబంతి బద్దికన్నెలకట్టేరు పుల్లెడ్లబంతి అని తొక్కెను స్వాములు హస్తములు మొయ్య అని తొక్కిన స్వాములకు ఏమిలంచాలు? అని తొక్కిన స్వాములకు మురిడీలగొలుసులు అని తొక్కిన స్వాములకు కొమ్ములకుతోళ్ళు అని తొక్కిన స్వాములకు దండకడియాలు అని తొక్కిన స్వాములకు బొడ్లోగంటలు |
![]() |
![]() |
![]() |