![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
69. గాజుల పాట |
గాజుల శెట్టి వచ్చాడె గౌరమ్మ తల్లి. గాజులబ్బి వచ్చె గంగమ్మ తల్లి. అమ్మ పిలిచి రమ్మంది అక్కరో నన్ను. నేను పిలచి వచ్చానె అక్కరో చూడు. అక్కరో నువు ముందు గాజులకు వెళ్లే. నీకు పెళ్లన్నదే అమ్మ నాతోనూ. రంగు రంగుల గాజులే రంగైన గాజులూ. అక్కరో నువుముందు వేయించుకోవే. గాజుల్లశెట్టి రాఓయి గౌరి వచ్చింది. కంబళ్లు పరువవోయి గాజుల్లశెట్టి. గౌరిదేవి రావే చెయి చేతికియ్యవే. ఏలాటి గాజులో ఎంచి చూసుకోవే. దారుగాజులెయ్య నా తల్లి గౌరమ్మ. అద్దాలగాజులా అవిచూడవమ్మ. నీవు కోరిన గాజులూ నువు వేయించుకోవే. నీలాలగాజులూ అవి వెయ్యవోయి. నాచెయ్యి కందకుండ నెమ్మదిగ వేయి. గౌరమ్మ కేశాను గంగమ్మ రావే. నీ కేమి గాజులో నువ్వెంచుకోవే. నా చేతిగాజులూ హస్తకంకణాలూ. నాచేతిగాజులే అవి మెరుపుగాజులూ. నా గాజులమోతకే జగమెల్ల ఒణుకు. |
![]() |
![]() |
![]() |