దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
71. ఓ బాలలారా

వీధులనాడేటి ఓ బాలలారా
మాబాలనెందైన కంటిరా మీరు
అమ్మ మీబాలకు ఆనవాలేమి?
జడజడా రత్నాలు జడరావి రేకు
పాపట పన్నీరు నొసట కస్తూరి
రాలేద మాబాల మిముగూడియాడ
ప్రొద్దుప్రొద్దొకచాయ ప్రొద్దొక్కచాయ
ప్రొద్దున్న అమ్మాయి మల్లెపూచాయ
జాముజామొక చాయ జామొక్కచాయ
జామున్న అమ్మాయి జాజిపూచాయ
ఒక్కొక్క ముత్యము వనకూడినట్లు
ఒప్పేటి కోమాళ్ల ఏ తల్లికనెనో
రమణులా కన్నదే తాను కౌసల్య
ఊరికి ఉయ్యాల లమ్మొచ్చినాయి
కొమాళ్ళకన్న తల్లి కొనవే ఉయ్యాల!
కోటివేలుపోసి కొనెను ఉయ్యాల!
AndhraBharati AMdhra bhArati - oo baalalaaraa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )