దేశి సాహిత్యము | యక్షగానములు | సుగ్రీవవిజయము కందుకూరి రుద్రకవి |
మధురకవితలు - ‘సుగ్రీవవిజయము’ (1939 ముద్రణ) పీఠిక - వేటూరి ప్రభాకర శాస్త్రి
ఆముఖము - ‘సుగ్రీవవిజయము’ (1973 ముద్రణ) పీఠిక - డా. జి.వి. సుబ్రహ్మణ్యం
రుద్రకవి - సుగ్రీవవిజయం
డా|| ఆర్. అనంత పద్మనాభరావు (‘150 వసంతాల వావిళ్ల వాఙ్మయ వైజయంతి’నుండి)
సుగ్రీవవిజయము - కందుకూరి రుద్రకవి | |||||||||||||||||||||
ఉ. | శ్రీవిభుఁ గొల్చి శంకరు భజించి చతుర్ముఖునెంచి భార్గవీ[1]- గ్రావసుతాసరస్వతులఁ బ్రార్థనసేసి గణేశపాదపూ- జావిధి సల్పి దేశికుల సంస్తవ[2]నం బొనరించి కావ్య వి- ద్యా[3]విదుల [4]న్నుతించి కవితాజడుల న్నిరసించి వేడుకన్.[5] | ||||||||||||||||||||
వ. | అని కవీశ్వరుఁడు కృతీశ్వరుండగు [6]కందుకూరి జనార్దనస్వామి నేమని [7]కొనియాడుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట[8] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని మఱియు[12] నద్దేవతాసార్వభౌమునకు[13] షష్ఠ్యంతంబులు సెప్పిన విధం బెటువలెను.[14] | ||||||||||||||||||||
అర్ధచంద్రికలు[15] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అంకితముగా నా యొనర్పంబూనిన సుగ్రీవవిజయంబను యక్షగానంబునకుం గథాక్రమం బెట్టిదనిన.[22] | ||||||||||||||||||||
సీ. | శ్రీరామచంద్రుండు సీతామహాదేవిఁ | గాననంబున వెదకంగ వచ్చి పంపాసరోవరప్రాంత్యభూములయందు | సౌమిత్రియునుఁ దాను సంచరింప నావేళ సుగ్రీవుఁ [23]డధికసంభ్రమముతో | ఋష్యమూకమున వర్తించుచుండి చూచి యా ఘనుల తేజోవి[24] శేషములకు | వెఱఁగంది మంత్రికోవిదు[25]న కనియె వీరు [26]మనలను వధియింప వేషమొంది | వాలి పంపున వచ్చిన[27]వారు గాను నాకుఁ గాన్పించుచున్నది గాకయున్నఁ | దాపసుల కేల శరచాప[28]ధారణంబు. | ||||||||||||||||||||
వ. | అని పలికి యచ్చోట [29]నిలువంజాలక భయపడుచున్న [30]సుగ్రీవునితో హనుమంతుం డేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | [36]అని పలికిన నీవు పోయి వారల వృత్తాంతంబంతయుఁ దెలిసి రమ్మని హనుమంతుని బంపి సుగ్రీవుండు దా నచ్చోట నుండవెఱచి మలయాద్రికిఁ బోయె, నట హనుమంతుండు రామలక్ష్మణుల సన్నిధికి వచ్చి దండప్రణామంబులు[37]సేసి యేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
ద్విపద. | అని పల్కి వినయమొప్పారంగ నున్న హనుమంతుఁ జూచి యిట్లనియె లక్ష్మణుఁడు. వనచరవీర యిక్ష్వాకువంశమున జనియించి లోకప్రశస్తుఁడైనట్టి దశరథేశ్వరుఁడు మా తండ్రి యీ విమల- [40]యశుఁడు రాముఁడు లక్ష్మణాహ్వయుఁ డేను దండ్రి యానతిమీఁదఁ దాపస[41]వృత్తి దండకాటవిలోన [42]ధరణిజ మేము సంచరింపఁగ రామజనపాలు దేవి- నంచితచారిత్ర యగు సీతనెత్తు- కొనిపోయె దుష్ట[43]మార్గుండు రావణుఁడు మనమున నెంచక [44]మము డాగురించి. వాని [45]పోఁబడి ఘోరవనభూములందుఁ బూనికఁ [46]దెలియంగఁ బూని యేతెంచి కమనీయగుణపుష్పకబరి యా శబరి సుమహితాత్ముఁ డటంచు సుగ్రీవుఁ జెప్ప దానిచే నతని వృత్తాంతమంతయును వీనులకింపుగా విని యా కపీంద్రు [47]నాదరంబున [48]నేలి యతని చిత్తంబు [49]ఖేదమంతయు మాన్పఁ గృప వుట్టి యిటకు వచ్చినవార [50]మెవ్వఁడవు మా మదికి [51]వచ్చియున్నవి నీ ప్రవర్తనల్గొన్ని దెలియఁజెప్పు మటన్న దినకరవంశ- [52]జలధీందునకుఁ గపిచంద్రుఁ డిట్లనియె.[53] | ||||||||||||||||||||
జంపె[54] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | [58]అనిన రాఘవేశ్వరుని చిత్తంబెఱింగి లక్ష్మణుఁడు హనుమంతునితో నేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె[59] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పలికి నీవు పోయి గొబ్బునఁ గార్యంబు సమకూర్పుమని పంపిన హనుమంతుండు శ్రీరామలక్ష్మణులకు మ్రొక్కి వీడ్కొనిన పిమ్మట నెటువలెను.[62] | ||||||||||||||||||||
ద్విపద. | అనిలనందనుఁడేగి యర్కతనూజుఁ గని మ్రొక్కి పలికె నో కపికులాధీశ ఆరూఢి [63]నీకు ననాయాసమునను శ్రీరాముఁడనెడి నిక్షేపంబు దొరకె నింక నీయక్కఱలెల్లను దీఱె గొంకక రఘురాముఁ గొల్వు మేతెంచి[64] యనిన సుగ్రీవుండు హనుమంతుతో[65]డ ననియె సంతసమంది యనఘ నీ కతన సలలితంబుగ రామచంద్రుని జూడఁ గలిగె నా శోకాంధకారంబు వాసె నాలస్యమేల చయ్యన ఋష్యమూక- శైలంబునకు రామజనపాలుఁ దోడి తెమ్మన్న నేఁగి ధాత్రీపాలసుతుల సమ్మతిఁ దోడ్కొని సరగ నేతెంచి నికటస్థలంబున నిలిపి సుగ్రీవు- నకు విన్నవించిన నయమొప్ప నతఁడు వచ్చి యా రాఘవేశ్వరునకు మ్రొక్కి మచ్చిక నతనిచే మన్ననల్గాంచి యమ్మహామహునిచే నగ్నిసాక్షిగను నమ్మికల్గొని తాను నమ్మికలొసఁగి గుహలోపలకి దోడుకొనిపోయి మున్ను మహిపుత్రి యాకాశమార్గంబునందు దనుజాధముండైన దశకంఠుఁ డెత్తు- కొనిపోవు నప్పుడా కుధరంబుమీఁద వడి మూటగాఁ గట్టి వైచినయట్టి తొడవులం గడుభక్తితోఁ గొంచువచ్చి యవనీశునకు నిచ్చిఁ యవి వచ్చినట్టి వివరమంతయుఁ దెల్ప విని మూర్ఛవో[66]యి [67]యల్లనఁ దెలివొంది యా భూషణముల నెల్ల నేర్పడఁజూచి యెద నొత్తుకొనుచు. | ||||||||||||||||||||
వ. | [68]అప్పుడు దుఃఖావేశంబున రామచంద్రుం డేమని శోకించుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట[69] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | [79]అని మఱియు [80]నేమనుచున్నాఁడు.[81] | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పలికి [84]రాఘవేశ్వరుం డెటువలెనుండెను. | ||||||||||||||||||||
అర్ధచంద్రికలు | |||||||||||||||||||||
కన్నుల నశ్రులు గ్రమ్మగ వగచున్ ఔరా విధివశమని తల యూఁచున్ ఏటికి ప్రాణములిఁక నని తలఁచున్ క్రమ్మఱ సొమ్ములు రొమ్మున నొత్తున్ [85]ఏ గతి నోరుతు నిఁక నని పలుకున్ [86]బాపురె విధి యని ఫాలము ముట్టున్.[87] | |||||||||||||||||||||
వ. | అని పలికి వగవ సమయంబిదిగాదు జానకిని సాధించుటకు మున్ను వీని పగదీర్తునని తలంచి సుగ్రీవునితో రామచంద్రుం డిట్లనుచున్నాఁడు. | ||||||||||||||||||||
గీ. | నమ్ము సుగ్రీవ యింద్రనందను వధించి నిఖిల వానరరాజ్యంబు నీకు నిచ్చు- వాఁడ మీలోన మీకును వైరమైన కారణంబేమి యనఁ బల్కె గపివరుండు. | ||||||||||||||||||||
జంపె[88] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
[90]అర్ధచంద్రికలు | |||||||||||||||||||||
అంత నెత్తురుటేఱు లంతటనె[91] వచ్చెన్ రక్కసుని ఘోషములు వెక్కసములాయెన్ వినరాకపోయెఁ గపివీరవరు పలుకున్. | |||||||||||||||||||||
వ. | [92]అంత నేను చింతాక్రాంతుడనై రాక్షసునిచేత వాలి మృతుండాయెనని నిశ్చయించి యా గుహవాత నొక్క పాషాణంబుఁ ద్రోచి యింద్రజునకుఁ దిలోదకంబులు విడిచి కిష్కింధకు వచ్చునప్పు డెటువలెనుండెను. | ||||||||||||||||||||
కుఱుచజంపె[93] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
ద్విపద. | అంత నా రాక్షసు ననిలోనఁ ద్రుం[96]చి సంతోష[97]చిత్తుఁడై చనుదెంచి వాలి [98]యగ్గిరిగహ్వరం బంతయుఁ దిరిగి యగ్గుహవాత శిల నుగ్గుగాఁ దన్ని, యచ్చోట నను గాన కాగ్రహంబొదవఁ జెచ్చెరఁ గదలి కిష్కింధకు[99] వచ్చి, వనచరకో[100]టి కొల్వంగ నున్నట్టి ననుఁ జూచి పలికె వానరులు భీతిల్ల, ఓరి దుష్టాత్మ! సహోదరుఁ డనుచుఁ గూరిమి నిను నమ్మి గు[101]హవాత నునిచి పగఱపైఁ జనిన నా పాటు [102]గన్గొనక తెగి రాజ్యభారంబు దీర్పవచ్చితివి చేటు గోరుచునున్న చెనటివి నీవు[103] పాటించి నమ్మితి బంధుండవనుచు.[104] ద్రోహివి నినుఁ బట్టి త్రుంపక రోష- దాహంబు తీఱదు తపనజ నాకు- నని పల్కి నా పత్నియగు రుమాకాంత గొని నా ప్రధానులఁ గొట్టి నాతోడ కదనంబు సేయ నక్కడ నిల్వలేక [105]కొదుకుచు వచ్చి యీ కొండ నెక్కితిని ఈ కొండ [106]యవ్వానరేశ్వరుం డెక్క- రాకుండ శపియించె రఘురామ తొల్లి [107]యనఘుఁడైన మతంగుఁడను మహామౌని యనిన సుగ్రీవున కనియె రాఘవుఁడు. | ||||||||||||||||||||
వ. | [108]ఏమి కతంబున వాలికీ కొండ నెక్కరాకుండ మతంగుండు శపియించెనని యడిగిన రామచంద్రునకు[109] కపిచంద్రుం డేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
అటతాళము[110] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అనిన విని [112]ధైర్యగుణావంధ్యంబగు వింధ్యంబు కడకేఁగి తన సత్త్వంబు చూపె, నట యెటువలెను. | ||||||||||||||||||||
అర్ధచంద్రికలు[113] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
ద్విపద. | అపుడు చిత్తంబులో నతిభీతినొంది విపులసంభ్రమముతో వింధ్యాద్రివిభుఁడు దనుజవల్లభునకుఁ దనయందుఁ గల్గు[115] ఘనతరవస్తువు ల్కానుకలిచ్చి దానవాధీశ! నా తరమె నీ తోడఁ బూని కయ్యముసేయఁ బోయి వేగంబె అసమాన[116]బలశాలియగు వాలితోడఁ గసిదీర యుద్ధంబు గావింపు మతఁడు నీకు మార్పడి పోరనేర్చు నటన్నఁ జేకొని వాఁడు కిష్కింధకు వచ్చి[117] గుహలెల్ల ఘూర్ణిల్ల కొండలు డుల్ల మహి [118]తల్లడిల్ల సామజములు [119]డిల్ల ననిసేయఁ బిలిచిన నసురేంద్రు [120]మీఁద వనచరమండలేశ్వరుఁడు కోపించి. | ||||||||||||||||||||
అటతాళము[121] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పలికి యా కళేబరంబు డగ్గఱకు [128]రామచంద్రుం దోడ్కొనిపోయి సుగ్రీవుం డేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
గీ. | అనిన విని రాఘవేశ్వరుఁ[131] డలఁతినవ్వు నెమ్మొగంబునఁ జిగురొత్త నిలిచి పాద- వనరుహాంగుష్ఠమున జిమ్మె దనుజవరుని [132]సముదితాంగంబు పదియోజనములఁ[133] బడగ. | ||||||||||||||||||||
వ. | ఇవ్విధంబునం దుందుభికళేబరంబు తన [134]బొట్టనవ్రేలఁ బదియోజనంబుల పొడవు బడఁజిమ్మి నిలిచిన రామచంద్రునితో సుగ్రీవుం డేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట[135] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
అటతాళము | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అప్పుడు రామచంద్రునకు సుగ్రీవుండు సాష్టాంగదండప్రణామంబు సమర్పించి యేమని [146]కొనియాడుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె[147] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని [150]మఱియు సుగ్రీవుం డేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట[151] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని సన్నుతించిన సుగ్రీవునిం జూచి శ్రీరామచంద్రుండు దయారససమన్వితుండగుచు నేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
తే. | [155]పొమ్ము సుగ్రీవ కిష్కింధపురమునకును వాలితోఁగూడ యుద్ధంబు లీలజేయు నాదు శరముల నాతని నమరద్రుంచి నిఖిలవానరరాజ్యంబు నీకు నిత్తు. | ||||||||||||||||||||
వ. | అని పంపి తానును వెంబడి లక్ష్మణసహితంబుగా వచ్చి యొక్క వృక్షంబు చాటున నుండె నప్పుడెటువలెనుండెను. | ||||||||||||||||||||
ద్విపద. | [156]దినకరతనయుండు దేవేంద్రతనయు ననిసేయఁ బిలిచిన నా యింద్రసుతుఁడు కినుకతో వచ్చి సుగ్రీవుని ఱొమ్ము తన ముష్టిఁ బొడిచినఁ దపననందనుఁడు జడియక యొక మహాశైలశృంగంబు వడిమీఱఁ గొనివచ్చి వాలిపై వైవ బలభేదిసుతుఁ డది పగులంగఁ దన్ని జలజాప్తసూను మస్తక మఱచేత మొత్తిన నొక్కింత మూర్ఛిల్లి తెలిసి యత్తఱి సుగ్రీవుఁ డచలేంద్ర మొకటి పెకలించుకొని వచ్చి భీకరధ్వనులు ప్రకటించి దేవతాపతిపుత్రు నేయ[157] దానిచేఁ గడునొచ్చి దశకంఠువైరి భానుజుఁ జొరఁబడి పట్టుక పొడువ [158]బలమఱి రఘురాముపై దృష్టి నతఁడు[159] సొలవక దిక్కులు చూచుచునుండె. | ||||||||||||||||||||
వ. | [160]అయ్యవసరంబున వృక్షంబు చాటున నుండి [161]రామచంద్రుం డేమని వితర్కింపుచున్నాఁడు. | ||||||||||||||||||||
ఏకతాళము[162] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
గీ. | ఏర్పరింపఁగ రాకున్న నితఁడు వాలి యితఁడు సుగ్రీవుఁడని యెట్టు లెఱుఁగవచ్చు నెవ్వఁ డీల్గునొ తొడిఁబడ నీ యమోఘ- సాయకంబేయ నని రాముఁ డేయకుండె. | ||||||||||||||||||||
వ. | అంత నొక్కవిధంబున వాలిచేత విడిపించుకొనివచ్చి ఋశ్యమూక పర్వతం[165] బెక్కి తన్నుఁ జేరవచ్చిన రామచంద్రునితోఁ దలవంచుకొని సుగ్రీవుం డేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట[166] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
ద్విపద. | అనిన సుగ్రీవున కనియె రాఘవుండు వనచరోత్తమ యేల వగచెద వింక[172] వారక [173]చూడఁగా వాలి రూపంబు నీ రూపమొక్కటై [174]నియతితో నుండ నేయకుండితి నింతె యిమ్మహాఘోర- సాయకంబెవ్వని జంపునో యంచుఁ గరమొప్పునట్టి యీ గజపుష్పమాల ధరియించి పోయి యుద్ధము సేయుచుండు [175]మిప్పుడేమియుఁ జెప్పనేల సుగ్రీవ యప్పుడు చూడు నా యంతరంగంబు. నావుడు రఘురామునకు జాగి మ్రొక్కి [176]భూవిభుఁ డిచ్చిన పుష్పదామంబు గళమున [177]నిడిపోయి కమలాప్తసుతుఁడు బలభేదినందను బవరమ్మునకును బిలిచిన విని రోషభీషణాకార- కలితాత్ముఁడై వాలి కడునవ్వి పలికె. | ||||||||||||||||||||
అటతాళము | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పలికిన చిఱునవ్వునవ్వి యవ్వీరాగ్రగణ్యుండు[185] తారతో నేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
ద్విపద. | అని తార మదిలోని యడలు వారించి ఘనగతి కిష్కింధ కదలి యేతెంచి యుగ్రనిశ్వాసముల్ హుమ్మని వెడల సుగ్రీవు ముందఱ శూరతఁ బలికె నోరి నాతో నిన్న యుద్ధంబు సేసి [191]పాఱియు నిపుడేల పఱతెంచి తీవు? నీతియు సిగ్గును నెఱయంగ విడిచి [192]యే తెంచితివి శిరమిదె త్రుంచువాఁడ. [193]నిలునిలుమని గర్వనిర్వాహమహిమ తలపడి ఘోరయుద్ధము సేయు [194]తరిని వాలి శౌర్యమునకు వడి నిర్వహింపఁ జాలక భీతుఁడై జలజాప్తసుతుఁడు వడిచెడి పాఱిపోవను గాళ్లురాక[195] [196]తడఁబడఁగా నింక తడయరాదంచు మెల్లనచేరి[197] సౌమిత్రిచేనున్న విల్లందుకొని రామవిభుఁ డెక్కుపెట్టి యురగేంద్రనిభమైన యొక దివ్యశరము తిరమొప్ప సంధించి తెగనిండఁ[198] దిగిచి వానరాధీశ్వరు వక్షస్స్థలంబుఁ బూనిక గుఱిసేసి పొంచి యేయుటయు ననలకీలలు గ్రమ్ము నమ్మహాశరము చని వాలిఱొమ్ము వెచ్చని నెత్తురొలుక, [199]సరికట్టె నప్పు డా శక్రనందనుఁడు శరము తోడను గూడ జగతిపై వ్రాలె. | ||||||||||||||||||||
గీ. | తరువు లేడు గాఁడి డగ్గరి గిరి డుల్చి జగతి[200]గాఁడి యురగ జగతి[201]గాఁడి [202]దొనకు వచ్చునట్టి మనుజేశు బాణంబు ప్లవగనాథుఁ [203]దూఱి పాఱదయ్యె. | ||||||||||||||||||||
వ. | [204]అంతం దన్నుం జేరవచ్చిన రామచంద్రువంకం జూచి వాలి యేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
త్రిపుట[205] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని మఱియు[212] నేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | [221]అనిన రామచంద్రుండు వాలితో నేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పల్కుసమయంబున వాలి మూర్ఛాగతుండయ్యె నట[227] యెటువలెను. | ||||||||||||||||||||
ద్విపద. | అంత నా వృత్తాంత మగచరుల్గొంద[228]- ఱంతఃపురంబున కరిగి వేగంబె తారతో వినుపింప ధైర్యంబు వదలి దారుణంబగు మూర్ఛ దద్దయు మునిఁగి మెల్లనఁ దెలిసి యా మీనాక్షి హస్త- పల్లవంబులు[229] సాఁచి పాపట చెదర వడి[230] మోదుకొనుచును వాలుఁగన్నులను వడియు[231] బాష్పజలంబు వఱదలై పాఱ నడుగులు తడఁబడ [232]నఱుపేదనడుము గడగడ వడంక ముక్తామణుల్ రాల పెనఁగొన్న పెన్నెరు ల్పిఱుఁదుపైఁ[233] దూలఁ జనుదెంచి జీవితేశ్వరుమీఁద[234] వ్రాలి[235] ఎలుఁగెత్తి బెట్టుగానేడ్చి ప్రాణేశు తలయెత్తి మెల్లనె తన తొడఁ జేర్చి[236] పయ్యెద కొంగునఁ బతిముఖాంభోజ- మొయ్యనఁ దుడుచుచు నువిద యిట్లనియె. | ||||||||||||||||||||
అటతాళము[237] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | [245]అని మఱియు నేమనుచున్నది. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని [251]పలికి తన యెదురనున్న సుగ్రీవునిం జూచి తార యేమనుచున్నది. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని [257]సుగ్రీవునిం దూఱి రామచంద్రుఁ [258]గనుంగొని యేమనుచున్నది. | ||||||||||||||||||||
త్రిపుట | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పలుకు సమయంబున వాలి మూర్ఛం దెలిసె నప్పుడు తన సమీపంబున శోకబాష్పకలితనేత్రుండయి తలవంచుకొనియున్న సుగ్రీవునిం జూచి యేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పలికి సుగ్రీవునకుఁ దన మెడనున్న కంఠమాలికనిచ్చి వెక్కసంబుగా శోకభరంబున వెక్కివెక్కి యేడ్చుచుం దన మొగంబు చూచుచున్న యంగదుని జూచి వాలి యేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
ద్విపద. | అని కుమారుని దేర్చి యవనీశమౌ[273]ళిఁ గనుఁగొని పలికె నా కపిచక్రవర్తి యో మహాత్మ! దయాపయోనిధి! రామ! భూమీతలేశ! నా పుణ్యమెట్టిదియో నీచేత మృతిఁబొంద నేఁడు [274]నాకబ్బె నాచారపరులకు నందగారాని [275]వైకుంఠమెదురుగా వచ్చె నిచ్చటికి గైకొంటి నా పాతకములెల్లఁ బాసె నేను ధన్యుఁడనైతి [276]నిహపరంబులకు భానువంశాధీశ! భవనాశరామ! ప్రాణముల్ నిర్వహింపవు మేన నింక బాణంబు తీయవే పార్థివోత్తంస! నావుడు రామభూనాథుఁడు చేరఁ- [277]గావచ్చి నిజభుజాగర్వంబు మెఱసి కపికులాధీశు వక్షము [278]గాఁడియున్న విపుల[279]సాయక ముద్దవిడి పెల్లగించె నప్పుడు రఘురాము నాత్మలో నిల్పి యొప్పుగా నింద్రజుఁ డూర్ధ్వలోకమున కరిగె నావేళఁ దారాది కామినులు గురుతరధ్వనులతో గుంపుగా నేడ్వ నంగదుఁ డధికశోకాంధకారమున [280]బ్రుంగుఁడై నేలపైఁ బొరలంగఁ జొచ్చె. | ||||||||||||||||||||
వ. | అప్పు డయ్యంగదుని శో[281]కంబు భరింపలేక సుగ్రీవాది వానరులు మహారోదనంబు చేసి రక్కోలాహలంబు మందరమథితమహార్ణవంబు ఘోషంబు ననుకరించె [282]తదనంతరంబ. | ||||||||||||||||||||
క. | తారాదిసతుల శోకము వారించి కుమారుఁ దేర్చి వాలికిఁ [283]బరలో+ [284]కారోహణాది సత్క్రియ- [285]లా రవితనయుండు రాము [286]నానతిఁ జేసెన్. | ||||||||||||||||||||
వ. | అంత నా రామచంద్రుండు కపివీరులం బిలిపించి సుగ్రీవునిఁ దోడ్కొనిపోయి కిష్కింధలో రాజ్యపట్టంబు గట్టుం, డంగదు యువరాజ్యపట్టంబు గట్టుండని యానతిచ్చి పంపిన కపివరులు రవిసుతుని పురంబునకు దోడ్కొనిపోయి రప్పుడు పురజను లేమనుచున్నారు. | ||||||||||||||||||||
జంపె | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని పలుకు సమయంబున సకలవానరులు కిష్కింధలో బట్టంబుగట్టి రట యెటువలెను. | ||||||||||||||||||||
అర్ధచంద్రికలు[289] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | తదనంతరంబ యంగదునకు యువరాజ్యపట్టంబు[290] గట్టిరప్పుడు [291]పుణ్యాంగనలు ధవళంబులు పాడి రట యెటువలెను. | ||||||||||||||||||||
ధవళములు | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అప్పుడు సుగ్రీవుండుఁ సకలవానరసమేతంబుగాఁ గానుకలు గొంచు రామచంద్రుని సేవింపవచ్చు [295]నప్పు డగ్గిరిప్రాంతంబున నున్న చెంచెతలు ఏలలు పాడి రట యెటువలెను. | ||||||||||||||||||||
ఏలలు | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | [302]అంత సుగ్రీవుండు రామచంద్రునిఁ జేరవచ్చి [303]కానుకలొసంగి సాష్టాంగదండప్రణామంబు చేసి యేమని వినుతించుచున్నాఁడు. | ||||||||||||||||||||
[304]సీ. | దండంబు శార్ఙ్గకోదండమండితహస్త | దండంబు వైకుంఠధామ నిత్య దండంబు కుండలీంద్రసుమౌక్తికచ్ఛత్ర | దండంబు దుర్జనఖండ దేవ దండంబు వారాశిదర్పసాహసజైత్ర | దండంబు దశరథతనయ వీర దండంబు మౌనీంద్రతతినిత్యపోషక | దండంబు యిందిరాధామవక్ష[305] | ||||||||||||||||||||
గీ. | దండ మినవంశజలనిధితారకేశ | దండ మఘహారయాతతధవళకీర్తి దండమౌ నీకు లోకేశధవళనయన | దండ మని కేలుమొగిచె నా తపనసుతుఁడు. | ||||||||||||||||||||
జంపె[306] | |||||||||||||||||||||
| |||||||||||||||||||||
వ. | అని సన్నుతించి రాఘవేశ్వరా మీరిచ్చోట నుండ నేమిటికిఁ గిష్కింధకు వేంచేయుండని పలికిన [308]రాఘవేంద్రుండు సుగ్రీవునితో నేమనుచున్నాఁడు. | ||||||||||||||||||||
ద్విపద. | వనజాప్తనందన వనవాసమునకుఁ జనుదెంచి మునివృత్తిఁ జరియించుచుండి[309] పట్టణంబులకు భూపతుల చందమున [310]నెట్టు రావచ్చు నీవెఱుఁగవే నీతి వానకాలము వచ్చె వైరులమీఁదఁ [311]బూని కయ్యముసేయఁ బోఁగూడ దిపుడు మా తమ్ముఁడును మేము మాల్యవంతమునఁ బ్రీతి నుండెదము సుగ్రీవ [312]నీ వేఁగి యీ నాల్గునెలలును నెలమిఁ గిష్కింధ- లోనుండి వర్షంబు [313]లోఁబడునపుడు సనుదెమ్ము వానర[314]సైన్యంబుతోడ- [315]నని, భానుసుతుఁ బంపి యనుజుండుఁ దాను మనుజేశ్వరుఁడు పోయె మాల్యవంతమున- [316]కినతనూజుండు కిష్కింధ కేతెంచి [317]తారాసమేతుఁడై తరుణీకృతోప- చారుఁడై వేడ్కలు సలుపుచునుండె.[318] | ||||||||||||||||||||
[318] | |||||||||||||||||||||
ద్విపద. | అని సమస్తాసురారాతికదంబ- వినమిత నిజభుజావిక్రము పేర సురుచిరప్రార్థనాసుభగంభవిష్ణు వరహావతార శ్రీవాసుని పేర నాతతార్చనలాలనాతిశయాళు భీతరక్షణు పేర స్పృహయాళు పేర నిగమగోచరు పేర నిఖిలలోకేశుఁ- డగు కందుకూరి జనార్దను పేర నంకితంబుగఁ గాళికాంబాప్రసాద- సంకలిత కవిత్వచాతుర్యధుర్య- తావర్య(ద్య) పెదలింగనార్యతనూజ కోవిద స్తవనీయగుణ రుద్రధీర విరచిత సుగ్రీవవిజయాభిధాన కరుణభాసుర యక్షగానప్రబంధ- మా చక్రవాళశైలావనియందు నాచంద్రతారార్కమై యొప్పుఁ గాత. | ||||||||||||||||||||
సుగ్రీవ విజయము - యక్షగానము - సంపూర్ణము. |
[1] వారిధి
[2] గ. మొప్పఁగఁజేసి
[3] గ.ఘ. విధులన్
[4] జ.ఝ. గణించి
[5] చ. కావ్యసద్భావుల నాదిసత్కవులఁ బ్రార్థనజేసి నుతించి వేడుకన్
[6] క. ఆశ్రితజనపోషకుండైన
[7] ఖ.ఘ.జ.ఝ. కీర్తింపుచున్నాఁడు
[8] చ. ఆహిరిరాగం
[9] గ. చర్యుడు
[10] ఛ. నుతి
[11] చ.జ.ఝ. లలో నీ చరణము రెండవదిగా నున్నది.
[12] క.ఖ.గ.ఘ.చ.ఛ.జ. సన్నుతించి
[13] చ.ఛ.ఝ. యా దేవునకు
[14] సెప్పెనట యెటువలెను. (అన్నిటియందును)
[15] చ. సౌరాష్ట్రరాగం
[16] క.గ. సేతువుగట్టిన సీతాపతికిన్
[17] జ. గూల్చిన
[18] జ. భావజు
[19] గ. గొల్చిన
[20] దీని పిదప గ. గోవులఁ గాచిన గోపాలునకున్
[21] క.గ.చ. చక్రాస్త్రునకున్
[22] ఖ.జ. క్రమంబెటువలె నుండెను.
[23] చ.ఛ. డఖిలమంత్రులుఁ దాను
[24] ఘ. విలాసములకు
[25] ఖ.ఛ. కోవిదుల
[26] క.ఖ. మనమును, గ.ఘ.చ.ఛ. మనముల
[27] ఘ. వారివలెను
[28] గ.ఘ.ఛ. ధారణములు
[29] గ.చ.జ. నిలువ శాకరింపక, ఛ. నిలువ సైరింపలేక
[30] క. సుగ్రీవునిం జూచి
[31] ఘ.చ.జ.ఝ. పరమరిసించి చూడక
[32] క. యందు రెండు మూఁడు చరణములకు మాఱుగా,
కపటమూర్తుల ఖలుల నప్పుడె గనగవచ్చును వీరలందును
కపటమించుకయైనఁ గానము కలఁగనేలా.
[33] ఖ.ఘ.చ.జ.ఝ. లందు రెండు చరణములు మాత్రమే గలవు. గ. యందైదవదియుఁ గలదు.
[34] గ.ఘ.ఛ.ల యందు కడపటిదిగ,
పోఁడిమిగ నే వారితోడను పూసగ్రుచ్చినరీతిఁ బలికియు
వేడుకలరఁగఁ దెలిసివచ్చెద నూరకుండు.
ఝ.లో హత్తివీరులు చూడ సజ్జనవృత్తి నరసి యూరకె
తత్తరింతురే యరసిచూడక తపనతనయా.
[35] క. వెఱవకుండుము.
[36] ఝ. అనిన సుగ్రీవుండు హనుమంతుని వాక్యంబులు విని అయినను
[37] ఝ. లాచరించి ముకుళితకరకమలుండై యేమనుచున్నాఁడు.
[38] క.ఖ.ఘ.జ.ఝ. మదికాశ్చర్య
[39] క.ఖ. అని పలికిన హనుమంతుని జూచి లక్ష్మణునితో శ్రీరామచంద్రుం డేమనుచున్నాఁడు.
*జంపె*
వీని నమ్మఁగవచ్చు విశ్వాసపరుఁడౌట
వీని నమ్మగవచ్చు విశ్వంబులోను.
పుట్టుబ్రహ్మచారి భుజబలోన్నతశాలి
ఘనవజ్రపంజరము కంటె లక్ష్మణుఁడా
మంచివాఁడగు వీఁడు మర్మజ్ఞుఁ డితఁడౌను
మన జానకిని దెలియ మఱి యుత్తముండు.
వ. అనిన శ్రీరామచంద్రునితో హనుమంతుం డేమనుచున్నాఁడు.
*త్రిపుట*
(?) నా రూపుగన్నపుడె నా తల్లిదండ్రివని
నీ పాదపద్మములు నే చేరి కొలుతున్.
నీవె నా గురుఁడవని నీవె నా దైవమని
నీ విపుడు నన్నేలు నిన్నెపుడు గొలుతున్.
అని పలుకు హనుమంతునితో లక్ష్మణుఁ డేమనుచున్నాఁడు.
[40] ఝ. యశుఁడు రాముడు లక్ష్మణాఖ్యుండ నేను
[41] గ. క్రియల
[42] ఝ. దావుగా మేము
[43] గ. వర్తనుఁడు, ఝ. కొనిపోయె మమ్ముఁ గైకొనక రావణుండు
[44] క.ఖ.గ. మము మోసగించి, ఘ.ఛ. మనమున వెఱువక మమ్ము మొరంగి, ఝ. మొనయంగలేక మమ్మును గనుమొరఁగి, చ. మనమున నేవగింపగ మమ్ము మొరఁగి.
[45] ఘ.ఝ. వెంబడి
[46] ఘ. తెలియగఁ బోవనేతెంచి, ఝ. తెలియక
[47] ఘ. నాదరంబుగ నతని చిత్తంబులోని
[48] జ. జేరి
[49] ఖ. ఘోర
[50] క.ఘ.ఛ. మెవ్వఁడ వీవు
[51] క.ఖ.ఘ.ఛ. వచ్చియున్నది నీ ప్రవర్తన గొంత, ఝ. వచ్చితిమని చెప్పి వనచరుఁడవిటకు వచ్చితి నీ పేరు వర్తనము గొంత
[52] జలధిచంద్రునకు అని యన్ని ప్రతులలో నున్నది.
[53] ఝ. చంద్రుండు పలికె
[54] చ. భైరవి
[55] ఘ. జుని
[56] ఖ.ఛ. లను, చ. లందు
[57] క.ఛ. తిలక
[58] క. అని పలికిన రామభద్రు
[59] చ. కల్యాణి
[60] చ. వర్తింతు నేను
[61] ఈ పాఠము ఘ. యందుమాత్రమే గలదు.
[62] క.ఖ.గ.ఘ.ఝ. మ్రొక్కి చనునప్పు డెటువలెనుండెను.
[63] క. నీ కనాయాసంబు కతన
[64] క. కొంకకు రఘురాము గొల్వు మేతెంచు, ఘ. కొల్వు కేతెమ్ము, ఖ. కొల్వు మేతెంచి, జ.ఝ. గొల్వు కేతెంచు
[65] ఖ.ఘ. జూచి
[66] చ. బొంది (అ)
[67] మెల్లనఁ దెలిసి యా మెలఁత భూషణములెల్ల
[68] ఘ. అంతట
[69] చ. ఆహిరి
[70] ఘ.చ. చనె
[71] దీని పిదప క. లో
ఓ గుణాంబుధిపూర్ణచంద్రిక యో కృపాంబుధిమథనసన్నుత
ఓ గుణోన్నత నీకు నన్విడిపోగ దగునా
గ. నీకు నన్నెడబాయఁదగునా, ఘ. నిన్ను వాసి నే నోర్వఁగలనా
[72] గ.ఘ. నీ వుండఁజాలక
[73] క. లో ఈ చరణము లేదు.
[74] క. గుదులుకొను బాపమున కంటికి నిదురరాదు
[75] ఘ. ముద్దుగుమ్మవు
[76] ఘ. నెన్నడు గందునయ్యో
[77] క.ఘ. కూడదన్నా
[78] క. చెల్లింపనేరక, ఘ. విహరించనేరక
[79] అప్పుడు
[80] క.ఖ.ఘ. మరి న్నేమనుచున్నాఁడు.
[81] చ. లో మొదటి రెండు చరణములు మాత్రమే యున్నవి. ఘ. లో 4, 9, 10 చరణములు లేవు.
[82] గ.ఛ. కార్య
[83] క. నిచ్చిన
[84] ఘ.ఛ. అని మఱి న్నెటువలెనుండెను, చ. రామచంద్రుం డెటువలెనుండెను, ఖ.ఘ.ఝ. లలో నీ వచనము లేదు.
[85] క. ఏ గతి నోపుదు నిపుడని
[86] ఖ.ఘ.ఛ. లలో నీ చరణము లేదు.
[87] దీని పిదప క.ఖ. లలో,
ఏమే జానకి యెందుబోతివో గదా యేమంటినే నిన్ను నో
భామారత్నమ యోర్వఁజాల గదవే ప్రాణంబు నీ కిత్తునే
యీ మేర న్నను మన్మథాగ్ని బొరలన్ ఇట్లేచెగా న్యాయమే
నామీఁదన్ దయ లేకపోతి వటవిన్ భామామణీ జానకీ.
శా. ఓ చంద్రానన యో చకోరనయనా యో పుష్పగంధీ సఖీ
భూచక్రంబున నిన్ను బోలరె సతుల్ బొల్పందగాఁ జూచినన్
... ... ... ...
నీ చాతుర్య లసద్విలాసమునకున్ నిన్నెంతునే జానకీ.
[88] ఛ. పాడిరాగం
[89] ఖ.ఘ.చ. వాకిటను నునిచెన్
[90] చ. నాట, జ. రేకులు
[91] క. అంతనే వచ్చెన్
[92] ఖ.చ.ఛ. చింతాక్రాంతుండ నయ్యేను
[93] ఛ. త్రిభంగులు
[94] గ. వైభవంబలరంగ వచ్చీ - వానరు లుభయపార్శ్వములందు నుండి - అని రెండవచరణము పిదపఁ గలదు. ఘ.చ.ఛ. లలో రెండు చరణములు మాత్రమే గలవు.
[95] క.ఖ.గ. మెఱయ నను దొఱజేసి మించి, ముదము మెఱయగొల్చిరి భక్తిమించి
[96] ఘ. గెల్చి
[97] ఖ. యుక్తుఁడై
[98] క.ఖ.చ.జ. లలో నీ ద్విపద కానరాదు.
[99] ఝ. కిష్కింధ కేతెంచి
[100] క.ఘ.చ.ఛ. కోట్లు
[101] క.ఖ.గ.ఛ.జ. గుహచెంత
[102] క.ఖ.ఘ.చ.ఛ.జ.ఝ. పాటు గైకొనక
[103] క. నిన్ను
[104] ఖ.గ.ఘ.చ. చేటు గోరుచునున్న చెనటి నెవ్వాఁడు, పాటించి నమ్ము నే బంధువటంచు, జ. బంధుఁడవు గావు, గ. బంధుఁ డనుకొంటి
[105] ఖ.చ. కొదకక
[106] క.ఖ.ఘ.ఛ. యవ్వానరేంద్రున కెక్క
[107] గ.ఘ.ఛ. అనఘాత్మ మాతంగుఁడను
[108] ఖ.ఘ.ఛ.జ. ఈ పర్వతము వాలి కెక్కరాకుండ నేమికతంబున, ఝ. ఈ కొండ యవ్వాలి కెక్కరాకుండ నేమి నిమిత్తంబున
[109] ఝ. సుగ్రీవుం డేమనుచున్నాఁడు.
[110] చ. గంభీరనాట, ఝ. త్రిపుట.
[111] క.ఘ.చ.ఛ. వారు రావలె
[112] క. గుణాద్యవంధ్యంబగు, ఛ. గుణవంద్యంబగు
[113] చ. రాగఁ పాడి......
[114] అచ్చులో ‘పడ’యను పదము లేదు.
[115] ఖ.చ. నున్న
[116] గ.ఘ.చ. జయ
[117] ఝ. కిష్కింధ కేతెంచి
[118] క.ఖ.ఘ.చ. మహి పెల్లగిల్ల
[119] క.ఖ.గ.చ. డుల్ల
[120] గ. తోడ
[121] చ. ఆహిరిరాగం, జ.ఝ. త్రిపుట
[122] ఖ. పట్టిమఱి
[123] అ. పోకుండ వాని
[124] ఖ. మూర్కొని
[125] ఝ. చిమ్మెను
[126] ఝ. చిమ్మినప్పుడె
[127] ఝ. నిమ్మహీధరముపై
[128] క.ఖ.ఘ.జ. రఘుపతిని
[129] క.గ.ఘ.చ. ఇది యోజనంబునకు హెచ్చుగా నటకు నీ, పదపద్మమున జిమ్ము బలిమిగలదేనిన్
[130] క.ఖ.ఘ.చ. లలో నీ చరణము లేదు.
[131] జ.ఝ. అలరి నవ్వు- మొలక మొగమునఁ జిగురొత్త
[132] క.ఖ. సమధికా
[133] గ. ముల పొడవు
[134] ఖ. బొటమనవ్రేల
[135] చ. ఆహిరి
[136] గ.ఘ. కాక
[137] క.ఖ.గ.చ. నిను
[138] ఖ. బాయక
[139] చ.ఛ. వక్రమగు నీ
[140] ఖ.ఘ.చ.ఛ. నొకపరి
[141] గ. జేర్చి
[142] క.ఖ.ఘ.చ. దగు నిను
[143] పిదప క. లో
నీ యమోఘశరంబు రయమున నిగుడజేసి, నా మది,
పాయకుండెడి భయము మాన్పుము భానువంశా
[144] చ. ఘనబలంబున
[145] ఖ. గైకొని
[146] గ. స్తుతింపుచు, ఘ. ఏమని స్తోత్రంబు సేయుచున్నాఁడు, చ. కీర్తింపుచున్నాఁడు
[147] చ. రామప్రియ
[148] క.గ.ఘ.ఝ. రాజధర్మవిశాల
[149] క.ఖ.గ.ఘ.చ. అని మఱి న్నేమనుచున్నాఁడు.
[150] చ. ఆహిరి
[151] ఘ. జయ శుభాకర రామ జయ ముత్తమాకామ (ఛ. జయజయోత్తమకామ.) జయభూపతే రామ జయ కృపాసీమా
[152] క.ఖ.గ.ఘ.చ.ఛ. లలో నీ చరణము లేదు.
[153] గ.చ. నా పగయెల్ల
[154] ఘ.చ.ఛ. లలో 4, 5 చరణములు లేవు. క.ఖ. గల యందు (4, 5) పైవానికి మాఱుగా
దివిజవందిత శరణురాఘవ దేవదేవ మునీంద్రసన్నుత
భువనరక్షణ నన్ను గావుము భూవరేణ్యా.
[155] ఖ.చ.ఛ.జ.ఝ. పొమ్ము సుగ్రీవా కిష్కింధకుఁబోయి వాలి తోడ యుద్ధంబు సేయుచుండుము. మదీయశరఘాతంబున వాలిని ద్రుంచి నిఖిలకపిరాజ్యంబు నీకుఁ బట్టంబుగట్టుదు, అని వచనము గలదు.
[156] ఖ.ఘ.చ. దినకరసుతుఁ డేఁగి దేవేంద్రతనయు
[157] క.ఖ.గ.ఛ. నేసె, ఘ. వైవ
[158] గ.ఛ. పలుమాఱు
[159] ఝ. బలువిడి
[160] ఖ.గ.ఘ.చ. అప్పుడు
[161] గ. రాఘవేశ్వరుండు
[162] ఛ. సౌరాష్ట్ర, జ. రేకులు, ఝ. అర్ధచంద్రికలు
[163] ఖ.గ.ఘ.చ.ఛ. లందీపాదము గానరాదు.
[164] క. లేమియు నెఱుఁగక
[165] ఖ.ఘ. బెక్కెనట రామచంద్రుండు దన్ను జేరవచ్చిన
[166] చ. ఆహిరి
[167] ఖ.చ. నన్ను
[168] జ. కటకట
[169] క. పడితిన్
[170] ఝ. జెల్లునె
[171] గ. గాదె
[172] క.ఖ.ఘ.చ. వింత
[173] ఖ.ఘ. చూచిన
[174] క.ఖ.గ.ఘ.చ.జ.ఝ. నెఱితోడనున్న
[175] ఖ.ఘ.ఝ. ఇపుడేమియును జెప్పనేల సుగ్రీవ
యపుడు చూచెదవు నా యంతరంగంబు
[176] ఝ. భూవరు
[177] ఖ. గొని
[178] ఘ. నాకుఁ జెల్లదు
[179] ఛ. నేఁడు నీతో ననికివచ్చుట
[180] పిదప క.ఖ. లలో
చిత్రకూటాచలమునందు విచిత్రముగను, జనకుని
పుత్రియును లక్ష్మణుఁడు భూపతి పొలుపుమీరన్
సుప్పనాతిని ముక్కుగోసిన సొరదినదియు, ఖరునకు
జెప్ప, దైత్యులతోడ వచ్చెను చెనటియసుర
వారి జంపె సురారి బంపగ వచ్చె మృగమై వచ్చిన
మారిచుండను దైత్యుఁ జంపెను మనుజవిభుఁడు.
[181] ఝ. గనుగొని
[182] గ.చ. గెల్వను
[183] ఖ. రమణరో
[184] ఖ. బొందు
[185] ఖ.ఘ.చ. వీరాగ్రణి
[186] ఖ. శరణు
[187] ఘ. నాకేటికి
[188] చ.ఛ. జాలి
[189] గ.ఛ. ఏటికి సమర
[190] క. సుగ్రీవుచే
[191] క.ఖ. పాఱి యెప్పటివలె పాఱుదెంచితివి
[192] క.ఖ. ఏతెంచుటకు శిరం బేఁ ద్రుంచువాఁడ
[193] చ.ఛ. నిలునిలుమీ యని నియతితోఁ బలికి
[194] ఖ.చ. నపుడు
[195] గ. లేక
[196] ఛ. తడబడుచో
[197] క.ఖ. లేచి
[198] క.ఖ. దీసి
[199] చ. సరిగట్ట
[200] ఖ.ఘ. నాటి
[201] ఛ. జూచి
[202] గ. మగుడి దొనకువచ్చు
[203] క. డుస్సి
[204] ఖ.ఛ. అప్పుడు, గ.చ. అయ్యవసరంబున, ఘ. అని
[205] జ. జంపె
[206] క. కోరితి
[207] ఛ. బొగులుచు
[208] క. వకట
[209] ఖ.ఘ.చ.ఛ. తగవు తగును ధరణీంద్రులకు న్యాయము
[210] ఖ. నీవు
[211] ఖ. వయ్యున్
[212] ఖ.ఘ.చ.ఛ. మరి న్నేమనుచున్నాఁడు.
[213] క.ఖ. నరులెంచుకోగాను నమ్మితిని నిన్ను
[214] జ. గడికట్టుకొనుట యెఱుఁగక మోసపోతి
[215] గ.ఘ. నా పేరకొని పిల్చి
[216] ఖ.ఘ. నృపధర్మ
[217] గ. వింత
[218] గ.ఘ.చ. గట్టి
[219] క. దెల్పకపోతివిటుగాక
[220] క.ఛ. యంత దైత్యుని దునిమి యవనిజను దేనా ఒకమాట నాతోడ నొనరంగఁ దెల్పవైతకట రావణు దునిమి యా సీతఁ దేనె
[221] క. అనిన విని రాఘవేశ్వరుఁడు, ఘ. రామచంద్రుఁడు
[222] చ. కార్య
[223] క.ఝ. ద్రుంప నే తగును
[224] గ.చ. చరియింపుచుండి దోషము చూడఁగలమే, క.ఖ.ఘ.ఛ. చరియించు మేము దోషము చూడగలమా
[225] ఖ. వేయక
[226] చ. లో 2, 3 చరణములు లేవు. కడపటి చరణము క.ఖ.గ.ఘ.చ.ఛ. లందు లేదు.
[227] చ. నప్పుడెటువలె నుండెను.
[228] ఘ. అగచరులొంచు
[229] గ. దాచి
[230] చ. మొత్తు
[231] జ.ఝ. బాష్పంబులు
[232] క. నల, ఖ.ఘ.ఛ. నఱి
[233] ఖ.ఘ.చ.ఛ. దూగ
[234] గ. జీవితేశ్వరునిపై
[235] చ. జనుదెంచి చనుపైట జాఱంగ వేగ, కదనరంగమునకు కణకతో వచ్చి, వడితోడ జీవితేశ్వరునిపై వ్రాలి
[236] ఝ. తలకెత్తుగా తొడతలగడఁ జేర్చి
[237] ఖ.జ. త్రిపుట, ఝ. జంపె ఆహిరిరాగము
[238] ఝ. ననుజుని
[239] ఛ. దరిచి
[240] ఖ. లో నీ చరణము లేదు.
[241] క. మిక్కిలి
[242] గ.చ.ఛ. సాగరమెట్లు
[243] ఘ. ఈ చరణము లేదు.
[244] క.ఖ.గ.ఘ.చ.ఛ. వాలుఁగన్నుల నీరు వరదలు వార నేడ్చు
[245] క.ఖ.ఘ.చ. మఱియు న్నేమను, ఛ. యందీ వచనము లేదు.
[246] ఖ. కేల సిద్ధించు, గ. కికనెందు గలుగు, జ. కేల గల్గెడిని
[247] క.ఖ. దైవమవు
[248] క.ఖ.ఛ. నేనెట్లు నిలుతు, జ. నేనెట్లు గడతు
[249] ఖ. మిల గలుగఁగలదే
[250] ఛ. నుండనేలా, ఘ. నొండు గలదే
[251] క. శోకావేశంబున
[252] ఘ. నా పాలి దైవంబైన, ఘ. నీ పాలి దైవంబాయె
[253] ఖ.ఘ. పౌరుషంబెచ్చె
[254] ఖ.ఘ.చ .బాపమేలని బుద్ధి
[255] గ. నీ కోర్కె సిద్ధించె, ఖ.ఘ.చ. లలో నీ చరణము లేదు.
[256] క. నీ తపం బీడేరె
[257] క.ఖ.ఘ. ఇవ్విధంబునం దూలనాడి, ఛ. ఇవ్విధంబున పలికి
[258] ఖ.చ.ఛ. మొగంబు చూచి
[259] ఘ. చనినయట్టి దశాస్యుడుండగ, జ. దశాస్యుఁ జంపక
[260] జ. ఇట్టి సాహసకర్మివని నిన్నెలమి భరతుఁడు సీమవెడలగ గొట్టి రాజ్యము బుచ్చుకొనఁడా కువలయేశా, ఛ. ఇట్టి సాహసకర్ముఁడనుచును నెంచి భరతుఁడు
[261] పిదప ఖ.ఘ.చ. అని మఱిన్నేమనుచున్నది. త్రిపుట.
[262] ఛ. విభుండవు
[263] (అన్నిటను) యనక యున్నన్, అని కలదు.
[264] గ. బడయు, ఘ.చ.ఛ. బొందు
[265] (అ) అంగదుఁడు బాలకుండగు గాన నీ యంత
[266] చ. ఇతఁడు
[267] ఘ.చ. శోకింప కుడుగు, ఛ. శోకింపు జోలి
[268] జ.ఝ. శుభమొందు
[269] ఖ.ఘ.చ.ఛ.జ.ఝ. నాగాత్యములు లేక
[270] క.ఖ.ఘ.ఝ. హితము గావించు
[271] జ.ఝ. యువ
[272] చ.ఛ. సుతుఁడ, యా విభవంబు
[273] గ. మౌని
[274] గ. తుర్యాశ్ర- మాచారపరులకు, ఝ. ఋష్యాశ్ర- మాచార
[275] జ.ఝ. వైకుంఠపదము నిర్వక్రంబు గాగ
[276] క.ఖ. ఇహపరంబులను, ఘ.చ. లందీ చరణము లేదు.
[277] క.ఖ. గావచ్చి నిజభుజాగర్వదుర్వార- త్రైలోక్యరక్షణధర్మప్రశస్తి- నెలమి బెంపగునట్టి నిజహస్తమునను కపికులాధీశు.
[278] గ. నాటి
[279] ఘ. సాయకము బల్విడి, ఛ. కేల్పడి
[280] అ. గ్రుంగుచు నేలపైఁ ద్రుళ్లంగజొచ్చె
[281] ఘ.చ. శోకంబునకు ధరింపలేక
[282] ఖ. నప్పుడెటువలె నుండెను.
[283] ఝ. వాలికినంతం- గూరిమిఁ బరలోకక్రియ
[284] ఘ.చ. కారోహణ కారణక్రియ, ఛ. కారోహణ వారిక్రియ
[285] జ. తారాతనయుండు
[286] గ. ఝ. ననుమతి
[287] ఘ. తనయుఁడె
[288] క.ఖ.ఘ. తార గోడు గుడువంగన్
[289] గ. త్రిభంగులు, చ. అనువులు, ఛ. వత్సరేకులు
[290] ఘ. గట్టి రా సమయంబున సతులు ఆరతులొసంగి ధవళంబులు
[291] గ. పురకాంతలు
[292] గ. గెలిచియు
[293] ఖ. యందీ చరణముమాత్రమే కలదు.
[294] ఘ.ఛ. పొగడొందున్
[295] నప్పుడు నగరప్రాంత్యంబున
[296] ఖ. పొగడఁగా, ఘ. చూడ
[297] గ.ఘ. గురుని పనుపున
[298] జ.ఝ. గోసి
[299] ఛ. దప్పి
[300] కావరమున
[301] క. పాటుగా
[302] క.ఖ.ఘ. అయ్యవసరంబున, ఛ. అనుచున్న సమయంబున.
[303] ఘ. కానుకలు సమర్పించి
[304] ఖ.ఘ. ఈ పద్యము లేదు.
[305] గ. వత్స
[306] ఖ. రచ్చతాళం
[307] రేకులు జ. ఝ
రమణీయ లోకాభిరామా, రామా
రామ రవికులజలధిసోమా
విమలపూజితనామ రామా
సమరమున రౌద్రాభిరామా
శ్యామసుందరకీర్తిదామా రామ
శరణయ్య లోకాభిరామా.
[308] ఘ. రఘుపతి
[309] ఛ. మేము
[310] క.ఖ.గ.ఘ.చ.జ.ఝ. నెట్టుగా రావచ్చు నెఱుఁగవా నీతి
[311] క. పూని కయ్యమునకుఁ బోవంగరాదు, ఘ.ఛ. పూనిక మీరంగఁ బోవరా దగదు, జ. పూనిక మీరంగఁ బోవంగరాదు, ఖ.ఝ. పూనిక మీరంగ బోవరా దింక
[312] ఖ. వినుమోయి
[313] ఘ.చ. లోఁబడినపుడె
[314] క.ఝ. సహితంబు గాగ
[315] జ. ననవుడు సుగ్రీవుఁ డతిభక్తితోడ
మనుజేశుపాదపద్మములకు మ్రొక్కి
యెనయఁ గిష్కింధకు నేతెంచి యంతఁ, (క.ఖ.) ప్రేమ.
దారాసమేతుఁడై తరుణులు గొలువ
సారంబుగా వేడ్క సలుపుచునుండె.
[316] ఘ. కినజుఁడు కిష్కింధ కేతెంచి పిదప, ఛ. కేతెంచి ప్రీతి
[317] ఝ. తారాసమేతుఁడై తనరి నిత్యోప-
చారంబులను వేడ్క సలుపుచునుండె.
ఘ. చారంబు వేడ్కతో సలుపుచునుండె.
[318] క. మంగళం. త్రిభంగులు.
ఇందిరావరునకు నిభభయహరునకు
కందర్పగురునకు కల్యాణం
సుందరబాహునకు సురుచిరదేహునకు
కందర్పగురునకు కల్యాణం
దినకరకులునకు దీనమందారునకు
ఘననిభగాత్రునకు కల్యాణం.
శ్రీ చింతా మధుసూదన్ (అనంతపురం), వారి విలువైన సమయమును వెచ్చించి ఈ కృతిని Transliterate చేసి మాకు యిచ్చారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
![]() |
![]() |