కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కావవే కమలాక్షి అంబ
జగన్మోహిని - ఆది
పల్లవి:
కావవే కమలాక్షి అంబ
కామిత ఫలదాయకీ నన్ను
॥కావవే॥
అనుపల్లవి:
భావ మలర నీ పదవనజములే
బట్టి వేడితిని పావని శంకరి
॥కావవే॥
చరణము(లు):
దీనులయెడ నీ వనయముజూపిన
ఘనమగు కరుణ నే గావలెనంటిగా
తనయుని భవజలధి దాటింపను
కనికరమిడవే గౌరి రాఘవుని
॥కావవే॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kAvavE kamalAxi aMba - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )