కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నీపయి నామనసు నిల్ప
ముఖారి - రూపక
పల్లవి:
నీపయి నామనసు నిల్ప
నిశ్చలభక్తి నీయవె అంబా
॥నీ॥
అనుపల్లవి:
చపలాత్ముడనై తిరిగి నీ
చరణాంబుజ సేవ మరచితి
॥నీ॥
చరణము(లు):
కలిలో దారసుత ధనకాంచనముల గని భ్రమించి
కలుషాత్ముడనైతి రాఘవుని కరమిడి కడు ముదమలరగ
॥నీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nIpayi nAmanasu nilpa - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )